Begin typing your search above and press return to search.

సుక్కు - చరణ్.. లక్కీ హీరోయిన్ ఎవరో?

రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 March 2025 8:00 PM IST
సుక్కు - చరణ్.. లక్కీ హీరోయిన్ ఎవరో?
X

మరోసారి సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. ఇప్పుడీ సెన్సేషనల్ కాంబో మరోసారి కలిసి పనిచేయబోతుండటంతో ఎలాంటి కాన్సెప్ట్ ఉండబోతుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్‌తో బిజీగా ఉండగా, సుకుమార్ తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో RC17 సెట్స్‌పైకి వెళ్లబోతోంది.

రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలిచిన ఈ చిత్రం రికార్డులలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ స్థాయిలో సుకుమార్ సినిమాల క్రేజ్ పెరిగిన నేపథ్యంలో RC17 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్‌తో ఈ సినిమా కూడా మరో పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ ఎంటర్‌టైనర్ కానుందని టాక్.

చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప 2 కంటే ముందే ఓ ఒక ప్లాన్ అయ్యింది. కానీ రంగస్థలం తర్వాత ఇరువురూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అవ్వడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. మధ్యలో రామ్ చరణ్ RRR కోసం పూర్తిగా డెడ్‌కేట్ అయ్యాడు. మరోవైపు సుకుమార్ పుష్ప సిరీస్‌ను ప్రారంభించి, అది యావత్ భారతదేశంలో భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరూ మరో స్థాయికి వెళ్లిన తర్వాత మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రాముఖ్యత, స్థాయి కూడా తక్కువగా ఉండదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాను పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. కంటెంట్‌ పరంగా ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఉండబోతోందట. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదానిపై తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సమంత పేరు బలంగా వినిపిస్తోంది. రంగస్థలంలో రామ్ చరణ్ - సమంత కాంబో హిట్ అయిన నేపథ్యంలో మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట. కానీ గత రెండేళ్లుగా సమంత తక్కువ సినిమాలు చేయడం, ఆమె ఆరోగ్య పరిస్థితులు, కెరీర్ ప్రాధాన్యత అన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

సమంత ఎంపిక సాధ్యమా లేదా అనేది ఒక ప్రశ్న. మరోవైపు రష్మిక మందన్నా కూడా ఈ రేసులో ఉందని టాక్. ఇటీవల వరుస హిట్స్ అందుకున్న రష్మిక, పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ పెంచుకుంది. దీంతో చిత్రబృందం మరోసారి ఆమెను తీసుకోవాలా? లేదా కొత్త అమ్మాయిని వెతకాలా అనే చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్ ఓన్లీ కంటెంట్ బేస్డ్ క్యాస్టింగ్ చేయడం వల్ల స్టార్ ఫాక్టర్ కంటే క్యారెక్టర్‌కు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను 2026 ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. RC16 పూర్తి అయిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 10 నెలల వ్యవధిలో షూటింగ్ పూర్తిచేసి 2027 సెకండ్ హాఫ్‌లో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, క్యాస్టింగ్ పనులు కూడా పక్కా అవుతున్నాయి. ఇక సుకుమార్ ఈసారి.క్యాస్టింగ్ తో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.