Begin typing your search above and press return to search.

సమంత వద్దని చాలా మంది అన్నారు..!

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 10:30 AM GMT
సమంత వద్దని చాలా మంది అన్నారు..!
X

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ ద్వారా నవంబర్‌ 7 నుంచి సిటాడెల్‌ : హనీ బన్ని వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. గత ఏడాది కాలంగా ఈ వెబ్‌ సిరీస్ గురించిన చర్చ జరుగుతోంది. హాలీవుడ్‌ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ కి ఈ సిరీస్‌ కి ఏమైనా సంబంధం ఉందా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో సిటాడెల్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సమంత మీడియా ముందుకు వచ్చి పదే పదే ఇంటర్వ్యూలు ఇస్తూ చర్చనీయాంశం అవుతుంది.

సిటాడెల్‌ లో సమంత హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్‌ నటుడు వరుణ్ దావన్‌ హీరోగా నటించిన విషయం తెల్సిందే. వరుణ్‌ దావన్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు చేశాడని, ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారట. తాజాగా వరుణ్ దావన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సమంతతో నటించడం అనేది సంతోషాన్ని కలిగించింది. ఆమె చాలా ప్రతిభ ఉన్న నటి. ప్రతి విషయంలోనూ ఆమె చూపించిన శ్రద్ద, యాక్షన్‌ సన్నివేశాల కోసం ఆమె పడ్డ కష్టంకు నేను షాక్‌ అయ్యాను. హీరోయిన్స్ ఇంతగా కష్టపడతారా అనుకున్నాను అంటూ వరుణ్ దావన్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఈ వెబ్‌ సిరీస్‌ను కమిట్‌ అయిన సమయంలో దర్శకులు రాజ్ డీకే లు హీరోయిన్‌గా సమంత ను అనుకున్నాం అన్నారు. అప్పుడు నాతో చాలా మంది సమంత హీరోయిన్‌ గా వద్దు అన్నారు. ఆమె నటించడం వల్ల సిటాడెల్‌ కి ఆ స్థాయి క్రేజ్ దక్కక పోవచ్చు అన్నారు. అయినా నేను ఆమె పై నమ్మకం ఉంచాను. దర్శకులు నమ్మకంతో ఆమెను తీసుకుని సిరీస్‌ను రూపొందించారు. వారు భావించినట్లుగానే సమంత అద్భుతమైన నటనతో మెప్పించింది. అంతే కాకుండా సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయిన తర్వాత ప్రతి ఒక్కరితో ప్రశంసలు దక్కించుకుంటుంది అంటూ వరుణ్ దావన్‌ బలంగా చెప్పుకొచ్చాడు. సమంత, వరుణ్ దావన్‌ మధ్య సన్నివేశాలు సిరీస్ కి ప్రధాన ఆకర్షణగా ఉంటాయట.

సమంత ఈ మధ్య కాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. సిటాడెల్‌ కోసం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ చేసే సమయంలో విపరీతమైన తల నొప్పితో పాటు, కనీసం అడుగు తిసి అడుగు పెట్టలేని విధంగా ఒల్లు నొప్పులు ఉండేవట. ఆ సమయంలో వరుణ్‌ దావన్‌తో పాటు యూనిట్‌ సభ్యులు అంతా చాలా సహాయం చేశారని, వారి వల్లే నేను ఈ రోజు ఈ సిరీస్ ను పూర్తి చేశాను. వేరే వారు అయితే సిరీస్‌ నుంచి తప్పుకుని ఉండేదాన్ని అంది. సమంత సిటాడెల్‌తో పాటు ఒక హిందీ సినిమాను చేస్తోంది. మరో వైపు సౌత్‌ లోనూ ఈమె సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఎక్కువగా నార్త్‌ కి ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.