సమంతను ఇకపై అలా చూడబోధట!
తెలుగు సినిమా హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది
By: Tupaki Desk | 6 Nov 2024 2:30 PM GMTటాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ సమంత. తెలుగు సినిమా హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. గత కొంత కాలంగా బాలీవుడ్‌లోనూ సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత బాలీవుడ్ కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. అయితే ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం పూర్తిగా హిందీ పరిశ్రమకే పరిమితం అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
సమంత నటించిన సిటాడెల్ : హనీ బనీ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్‌తో సమంత బాలీవుడ్‌లో తన స్థానంను మరింత పదిల పరచుకుంటుందని అంతా నమ్ముతున్నారు. ఇటీవల సిటాడెల్ ప్రమోషన్‌లో భాగంగా సమంతను ఒక నెటిజన్ మీరు గతంలో మాదిరిగా ఎందుకు ఎక్కువ కమర్షియల్ పాత్రలు ఎంపిక చేసుకోవడం లేదు, మీరు ఎందుకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడం లేదు అంటూ ప్రశ్నించడం జరిగింది. అందుకు సమంత తాను ఇకపై అలాంటి సినిమాలు చేయను అంటూ తేల్చి చెప్పింది.
సమంత ఆ ప్రశ్నకు స్పందిస్తూ... ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, రెగ్యులర్ డాన్స్ ఉండే పాటలు చేయను అని చెప్పింది. నటిగా నాకు సవాల్ విసిరే పాత్రలను ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ సమయంలో నేను సినిమాలను ఎంపిక చేసుకునే పరిస్థితిలో ఉన్నాను. కనుక మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా నన్ను నేను సంతృప్తి పరచుకునే విధంగా సినిమాలు చేస్తాను అంటూ ప్రకటన చేసింది. అంటే ఇకపై సమంత నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఆశించడం అత్యాశ అవుతుంది. ఇకపై ఆమె నుంచి రెగ్యులర్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగు లో ఒక సినిమాను చేస్తూ ఉన్నప్పటికీ అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని తెలుస్తోంది. తమిళంలోనూ ఇటీవల ఒక సినిమా కోసం చర్చలు జరిగాయి. సిటాడెల్ స్ట్రీమింగ్ కి ముందే మరో వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటించేందుకు సమంత కమిట్ అయింది. ఇటీవలే ఆ వెబ్ సిరీస్ అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది చూడాలి. సమంత ఓకే అనాలే కానీ ఊ అంటావా.. వంటి పదుల కొద్దీ ఐటెం సాంగ్స్ ఆమె ముందు ఉంటాయి. కానీ ఆమె మాత్రం ఐటెం సాంగ్స్ కి, ప్రత్యేక పాత్రలకు ఆసక్తి చూపడం లేదు. కనుక ఇక ముందు సమంతను అలా స్పెషల్ గా చూసే అవకాశం లేదు.