నా వల్ల కావడం లేదని మేనేజర్ కి ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన సమంత.. ఎందుకంటే..?
ఫ్యామిలీ మ్యాన్ 2 టైం లో మొదటి షెడ్యూల్ లోనే యాక్షన్ సీన్స్ చేశారు. మాములుగా అయితే తను రెండు మూడు రోజులు చేసే సీన్స్ అన్నీ అక్కడ గంటల్లో చేశారు
By: Tupaki Desk | 11 Nov 2024 6:54 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ లో నటించి మెప్పించిన అమ్మడు రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీతో మరోసారి అదరగొట్టేసింది. ఈ సీరీస్ లో నటించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచింది సమంత. ఐతే రాజ్ అండ్ డీకే తో ఫస్ట్ టైం పనిచేస్తున్న టైం లో చాలా ఇబ్బంది పడ్డానని సమంత చెప్పుకొచ్చింది.
ఫ్యామిలీ మ్యాన్ 2 టైం లో మొదటి షెడ్యూల్ లోనే యాక్షన్ సీన్స్ చేశారు. మాములుగా అయితే తను రెండు మూడు రోజులు చేసే సీన్స్ అన్నీ అక్కడ గంటల్లో చేశారు. ఆ టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల తనకు బాధ కలిగిందని తన మేనేజర్ కి ఫోన్ చేసి నేను చేయలేకపోతున్నానని ఏడ్చేశానని చెప్పుకొచ్చారు సమంత. ఐతే ఆ తర్వాత వారి వర్కింగ్ స్టైల్ తనకు అలవాటైందని అందుకే సిటాడెల్ టైంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు సమంత.
ఇక పాత్రల ఎంపిక విషయంలో తను చేసే సినిమాల వల్ల ఎంతో కొంత ప్రభావం ఉండాలని చూస్తానని అంటున్నారు సమంత. హీరోలకు సమానమైన రోల్స్ కథానాయికలకు రావాలని అన్నారు సమంత. ఐతే అది అన్ని వేళలా సాధ్యం కాకపోయినా అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు తమ ప్రతిభ చాటాలని అంటున్నారు సమంత. రాజ్ అండ్ డీకేలతో పోలిస్తే తెలుగు, తమిళ దర్శకులు చాలా బెటర్. వీళ్లు అనుకున్న టైం కు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేయాలని అనుకుంటారని చెప్పారు సమంత.
ఇక హాలీవుడ్ లో చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఇక్కడ వస్తున్న ప్రాజెక్ట్స్ తోనే సరిపోతుందని అన్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రాజ్ అండ్ డీకేతోనే ఉంటుందని చెప్పారు సమంత. సిటాడెల్ సీరీస్ లో సమంత నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పాత్రల ఎంపికలో సమంత చూపిస్తున్న ఈ సాహసానికే ఆమె కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరిగేలా చేస్తున్నాయి.
సౌత్ సినిమాలను వదిలి పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమయ్యే ఆలోచనలో ఉన్న సమంత తిరిగి సౌత్ సినిమాల్లో నటిస్తే చూడాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఐతే చేస్తున్న ప్రాజెక్ట్స్ సూపర్ హిట్ అవుతుండటం వల్ల సమంతకు బాలీవుడ్ నుంచి వరుస క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఐతే సమంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమా ఒకటి ప్రకటించారు. మరి ఆ సినిమా ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మాత్రం తెలియట్లేదు.