Begin typing your search above and press return to search.

స‌మంత కొత్త సినిమా తానే చెప్ప‌లేని స్థితిలో!

`ఖుషీ` త‌ర్వాత స‌మంత ఇంత వ‌ర‌కూ కొత్త సినిమా కి క‌మిట్ అవ్వ‌లేదు. బాలీవుడ్ సినిమాలే టార్గెట్ గా ముంబైలో తిష్ట వేసింది కానీ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 3:00 AM IST
స‌మంత కొత్త సినిమా తానే చెప్ప‌లేని స్థితిలో!
X

`ఖుషీ` త‌ర్వాత స‌మంత ఇంత వ‌ర‌కూ కొత్త సినిమా కి క‌మిట్ అవ్వ‌లేదు. బాలీవుడ్ సినిమాలే టార్గెట్ గా ముంబైలో తిష్ట వేసింది కానీ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయ‌లేదు. అమెరికా టూర్ అనంత‌రం నేరుగా ముంబైలో ల్యాండ్ అయిన బ్యూటీ సినిమా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా? ఫ‌లించ‌డం లేదు. ల‌క్కీగా వెబ్ సిరీస్ ల్లో అవ‌కాశాలు రావ‌డంతో? వాటితో బిజీ అవుతుంది. లేదంటే? ఈ గ్యాప్ అన్న‌ది స‌మంత మార్కెట్ పై ప్ర‌భావం చూపించేది.

మ‌రి సినిమా ఛాన్స్ లు ఎందుకు రాలేదంటే? అవ‌కాశాలు వ‌స్తున్నా? స‌మంత అనుకున్న అవ‌కాశాలు రాక‌పో వ‌డంతోనే ఆల‌స్య‌మ వుతుంద‌ని తెలుస్తోంది. సెకెండ్ ఇన్నింగ్స్ ను అమ్మ‌డు చాలా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుంది. కేవ‌లం ప్రేక్ష‌కుల్లోకి బ‌లంగా వెళ్లే పాత్ర‌లు మాత్ర‌మే చేయాల‌నుకుంటుంది. తాను ఏపాత్ర చేసినా...ఏ సినిమాలో న‌టించినా అది ఛాలెంజింగ్ గా ఉండాలి త‌ప్ప‌! రెగ్యుల‌ర్ ప్యాట్ర‌న్లో ఉంటే చేయ‌నంటోంది.

అయితే స‌మంత అనుకుంటోన్న అవ‌కాశాలు రావ‌డం అంత వీజీ కాదు. ఛాలెజింగ్ పాత్ర‌ల‌నేవి ర‌చ‌యిత‌లు ప‌నిగ‌ట్టుకుని రాయాలి. అమీర్ ఖాన్ , షారుక్ ఖాన్ లాంటి వాళ్లు మూడేళ్ల‌కు ఒక సినిమా రిలీజ్ చేయ‌డ‌మే క‌ష్టంగా ఉంది. ఇలా ఆల‌స్యం ఎందుకు జ‌రుగుతుంది అంటే? స‌రైన క‌థ‌లు కుద‌ర‌క‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే ..క‌థ‌లు కుదిరినా పాత్ర‌లు బ‌లంగా లేక‌పోవ‌డంతోనే త‌మ నుంచి సినిమాలు డిలే అవుతున్నాయ‌ని ఓ సంద‌ర్భంలో అన్నారు.

అలాంటి స్టార్ హీరోల‌కే స్క్రిప్ట్ లు కుద‌ర‌డానికి అంత స‌మ‌యం ప‌డుతుందంటే? సమంత కోసం ప్ర‌త్యేకంగా క‌థ‌లు ఎవ‌రు రాస్తారు? అన్న‌ది ఆలోచించాల్సిన విష‌య‌మే. పైగా ప్ర‌స్తుతం బాలీవుడ్ ఆ ప‌రిస్థితుల్లో లేదు. పాన్ ఇండియాలో త‌మ కంటెంట్ ఎలా ఫేమ‌స్ అవ్వాలి? అన్న దానిపైనే దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నారు. వాళ్లే ఇత‌ర రైట‌ర్ల‌పైనా...ఇండ‌స్ట్రీల‌పైనా ఆధార‌ప‌డుతున్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మంత అనుకునే పాత్ర‌లు వీల‌వుతాయా? అన్న‌ది చూడాలి.