ఒలింపిక్ స్క్వాడ్ బ్యూటీలా సమంత!
సమంత మంచి ఫిట్ నెస్ ప్రీక్. డైలీ లైఫ్ లో కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. చెమటలు కక్కుతూ వర్కౌట్లు చేస్తుంది.
By: Tupaki Desk | 9 Sep 2024 9:34 AM GMTసమంత మంచి ఫిట్ నెస్ ప్రీక్. డైలీ లైఫ్ లో కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. చెమటలు కక్కుతూ వర్కౌట్లు చేస్తుంది. లుక్ ఛేంజోవర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ అనిపించుకోవడం కోసం శ్రమిస్తుంది. డైట్ విషయంలోనూ అంతే కేర్ఫుల్ గా ఉంటుంది. వర్కౌట్లను బ్యాలెన్స్ చేస్తే డైట్ తీసుకుంటుంది. యానిమల్ ప్రొటీన్ కి దూరంగా ఉంటుంది.
వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటుంది. పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతుంది. మోర్నింగ్ రొటీన్ ప్రొటీన్ షేక్స్ తీసుకుంటుంది. వీటితో పాటే నిరంతరం శరీరానికి తగినన్ని నీళ్లు తీసు కుంటుంది. జిమ్ కి వెళ్లే ముందు.. గుడ్డు బట్టర్ వంటివి పరిమితంగా తీసుకుంటుంది. డేలో సమంత జిమ్ షెడ్యూల్ ఇలా ఉంటుంది. తాజాగా సమంత ఏకంగా అథ్లెట్ లుక్ నే దించేసింది.
ఇదిగో ఇక్కడిలా బ్యాక్ ఫోజ్ లో అమ్మడు అచ్చంగా ఒలింపిక్స్ అథ్లెట్ బ్యూటీనే తలిపిస్తుంది. రెండు చేతుల్లో డంబెల్స్ పట్టుకుని బ్యాక్ నుంచి ఫోజులిచ్చింది. వెయిట్ కారణంగా మజిల్స్ మెలితిరాయా. బాడీ అంతా స్టిప్ గా మారింది. ఈ ఫోటోని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. `నేను సన్నగా కనిపించడం లేదు. నేను మీ బు**ని తన్నేలా కనిపిస్తున్నాను` అంటూ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సమంత ఫోజుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అందమైన సమంతనే కాదు. అమె లో మంచి కిక్ బాక్సర్ ఉన్నాడంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. ఇక సమంత కెరీర్ సంగతి చూస్తే సరైన ప్రాజెక్ట్ కోసం సెర్చ్ చేస్తోంది. అమెరికా టూర్ ముగించుకుని వచ్చి నెలలు గడుస్తున్నా? ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని సంగతి తెలిసిందే.