Begin typing your search above and press return to search.

స‌మంత క్రిప్టిక్ పోస్ట్ వెన‌క ప‌ర‌మార్థం

ఈ మధ్య ‘సిటాడెల్’ సిరీస్ రిలీజ్ సందర్భంగా జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో.. తన ఎక్స్‌కు కాస్ట్‌లీ గిఫ్టులివ్వడం వర్త్ లెస్ అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి

By:  Tupaki Desk   |   13 Feb 2025 11:43 AM GMT
స‌మంత క్రిప్టిక్ పోస్ట్ వెన‌క ప‌ర‌మార్థం
X

సమంత రూత్ ప్రభు -నాగ చైతన్య జంట విడాకులు ప్ర‌క‌టించి మూడేళ్ల‌యింది. అయినా ఇప్ప‌టికీ ఈ బ్రేక‌ప్ గురించి మీడియాలో క‌థ‌నాలొస్తూనే ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో నాగ‌చైత‌న్య చేసిన ఒక‌ వ్యాఖ్య అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది. సమంత‌తో త‌న విడాకుల‌కు శోభిత కార‌ణం కాద‌ని, స‌మంత‌తో బ్రేక‌ప్ అయ్యాకే శోభిత‌తో ల‌వ్‌ మొద‌లైంద‌ని చైతూ చెప్పారు. శోభిత వ‌ల్ల‌ విడిపోయార‌నే పుకార్లను తోసిపుచ్చారు.

ఇప్పుడు సమంత రూత్ ప్ర‌భు చేసిన ఓ పోస్ట్ అంత‌ర్జాలంలో హాట్ టాపిగ్గా మారింది. సంబంధాలలో మానసిక, శారీరక శ్రేయస్సు ప్రాముఖ్యతను స‌మంత ఈ పోస్ట్ లో హైలైట్ చేసింది. రిలేష‌న్ లో ఒక‌రి శ్రేయస్సును నిర్లక్ష్యం చేయడం సంబంధాలను ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో సామ్ వెల్ల‌డించింది. అద్భుతమైన భాగస్వామితో మంచి బంధం ఉంద‌ని అనిపించ‌వ‌చ్చు... కానీ మ‌న‌ శారీరక , మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే భాగస్వామితో కోరుకున్న విధంగా ఏదీ ముందుకు సాగ‌దు! అని స‌మంత న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అంతా బాగానే ఉన్న‌ట్ట‌నిపిస్తుంది.. కానీ నీకంటూ ఒక మ‌నసు శ‌రీరం ఉన్నాయ‌ని గుర్తించ‌లేని ప‌క్షంలో.. ఈ వ్య‌క్తిని కోల్పోయిన‌ట్టే! అని అన్నారు.

ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య ఓ పాడ్ కాస్ట్ లో విడాకుల గురించి మాట్లాడాడు. ఒకరికొకరు గౌరవంగా తీసుకున్న `పరస్పర నిర్ణయం` అని అన్నాడు. ఎవ‌రి మార్గాల్లో వారు వెళ్లాలనుకున్నాము. మా సొంత కారణాల వల్ల, మేం ఈ నిర్ణయం తీసుకున్నాము. మేము ఒకరినొకరు గౌరవిస్తాము! అని చైత‌న్య‌ అన్నారు. ఆ త‌ర్వాత అత‌డు శోభిత ధూళిపాల‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2017 లో వివాహం చేసుకున్న సమంత - నాగ చైతన్య 2021 లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. స‌మంత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో డేటింగ్ లో ఉందంటూ పుకార్లు వ‌స్తున్నా, దానికి అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.