Begin typing your search above and press return to search.

సమంత.. ఖర్చు పెట్టడంలో బిజీబిజీగా..

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషలలో తిరుగులేని ఇమేజ్ తో నటిగా దూసుకుపోయింది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:27 AM GMT
సమంత.. ఖర్చు పెట్టడంలో బిజీబిజీగా..
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషలలో తిరుగులేని ఇమేజ్ తో నటిగా దూసుకుపోయింది. అయితే గత ఏడాది వచ్చిన ‘ఖుషి’ తర్వాత సమంత స్పీడ్ కి కాస్తా బ్రేక్స్ పడింది. ఈ బ్రేక్ కావాలని ఆమెనే తీసుకుంది. కొంతకాలం శారీరక, మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యి కెరియర్ కి బ్రేక్ ఇచ్చింది. మరల ఇప్పుడు కథలు వింటుంది. బాలీవుడ్ లో కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లలో సమంత భాగం అయినట్లు టాక్ వినిపిస్తోంది. వెబ్ సిరీస్ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇంకా ఏవీ అధికారికంగా ఎనౌన్స్ కాలేదు. మరో వైపు సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రాలల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ప్రారంభించి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని మొదటి ప్రాజెక్ట్ గా ఎనౌన్స్ చేసింది. ఫీమేల్ సెంట్రిక్ కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ లో నటిస్తోంది. అయితే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టేటస్ ఏంటనే దానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే తన ప్రొడక్షన్ లో ఇతర హీరో, హీరోయిన్స్ తో కూడా సమంత మూవీస్ చేయాలని అనుకుంటుందంట.

బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యిందంట. ఓ వైపు యాక్టర్ గా కొనసాగుతూనే మరో వైపు ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్ గా మారాలని సమంత ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన ప్రొడక్షన్ లో రెండో సినిమాని ప్రియదర్శి హీరోగా కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.

నిర్మాతగా తన బ్యానర్ లో కథ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయాలని సమంత అనుకుంటుందంట. మంచి కథ దొరికితే ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా భిన్నమైన కథలు వినడానికే ఇష్టపడుతుందని చర్చ నడుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలలో కూడా ఆమె మూవీస్ నిర్మించాలని ప్లాన్ చేసుకుంటుంది. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ యాక్టర్ గా కెరియర్ కొనసాగిస్తూనే ప్రొడ్యూసర్స్ గా మారుతున్నారు.

ఇప్పుడు వారి బాటలోనే సమంత కూడా నిర్మాతగా సౌత్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈమెని తెలుగులో హీరోయిన్ గా చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సమంత కూడా రీసెంట్ గా ‘జిగ్రా’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలుగులో సినిమాలు చేయడంపై అభిప్రాయాన్ని తెలిపింది. త్రివిక్రమ్ అడిగిన మాటకి తాను సిద్ధంగానే ఉన్నానని హింట్ ఇచ్చింది.