Begin typing your search above and press return to search.

త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్‌తో సామ్ ఫోజ్

సిటాడెల్: హ‌నీ బ‌న్ని స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఇంత‌లోనే ర‌క్త బ్ర‌హ్మాండ్ అనే వెబ్ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకేతో క‌లిసి ప‌ని చేస్తోంది స‌మంత‌.

By:  Tupaki Desk   |   26 Sep 2024 3:58 PM GMT
త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్‌తో సామ్ ఫోజ్
X

రాజ్ అండ్ డీకేతో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ ల‌కు ప‌ని చేస్తోంది స‌మంత రూత్ ప్ర‌భు. `ఫ్యామిలీమ్యాన్ 2`లో రాజీ పాత్ర‌తో స‌మంత‌కు బిగ్ ట‌ర్నింగ్ పాయింట్ ని ఇచ్చారు ఈ ద‌ర్శ‌క‌ద్వ‌యం. దీంతో వ‌రుస‌గా సామ్ వారితో క‌లిసి ప‌ని చేస్తోంది. సిటాడెల్: హ‌నీ బ‌న్ని స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఇంత‌లోనే ర‌క్త బ్ర‌హ్మాండ్ అనే వెబ్ సిరీస్ కోసం రాజ్ అండ్ డీకేతో క‌లిసి ప‌ని చేస్తోంది స‌మంత‌.

ప్ర‌స్తుతం సామ్ త‌న ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుల‌తో క‌లిసి బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హ‌నీ బ‌న్నీ గ్రాండ్ ప్రీమియర్‌కు ముందు ప్రత్యేక ప్రదర్శనకు హాజరు కావడానికి స‌మంత‌ లండన్‌కు వెళ్లింది. తాజాగా దర్శకుడు రాజ్, రచయిత సీతా ఆర్ మీనన్‌తో కలిసి ఉన్న‌ప్ప‌టి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఫోటోలో సమంత రాజ్ - సీతతో క‌లిసి నవ్వుతూ కెమెరాలకు పోజులిచ్చింది. ముగ్గురి మధ్య పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ మూవ్ మెంట్ ఇది. లండన్‌లో జరిగిన ఈవెంట్ లో వీరంతా చాలా సంద‌డి చేసారు. ఈవెంట్ నుంచి సమంత తన కొత్త స్లిమ్మింగ్ రూపాన్ని రివీల్ చేసే చాలా సోలో ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. షీర్ నెక్‌లైన్‌తో రూపొందించిన జంప్‌సూట్ సామ్ రూపానికి గ్లామ్ ని అద్దింది. లండ‌న్ లో జ‌రిగిన కార్యక్రమంలో స‌మంత‌తో పాటు ప్రియాంక చోప్రా, మటిల్డా త‌దిత‌రులు పాల్గొన్నారు. వరుణ్ ధావన్ ఈవెంట్ లో క‌నిపించ‌లేదు. కానీ రాజ్ అండ్ DK, రస్సో బ్రదర్స్ సహా సిటాడెల్ మొత్తం టీమ్ హాజరయ్యారు. సిటాడెల్: హనీ బన్నీ, నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం ప్రారంభమవుతుంది. ఇది ప్రియాంక చోప్రా -రిచర్డ్ మాడెన్ నటించిన అమెరికన్ స్పై యాక్షన్ టెలివిజన్ సిరీస్ కి భారతీయ స్పిన్-ఆఫ్. మునుముందు సీక్వెల్స్ ను మేక‌ర్స్ కొన‌సాగించనున్నారు.