Begin typing your search above and press return to search.

సోద‌రుడి పెళ్లిలో స‌మంత సైలెంటుగా

ఇంత‌లోనే ఇప్పుడు స‌మంత‌ తన సోదరుడు డేవిడ్ వివాహానికి ఎటెండ‌యింది. అందుకు సంబంధించిన అందమైన ఫోటోలను షేర్ చేయ‌డంతో సామ్ తాజా వ్య‌వ‌హారం బ‌య‌టికి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 5:56 AM GMT
సోద‌రుడి పెళ్లిలో స‌మంత సైలెంటుగా
X

సమంతా రూత్ ప్రభు కెరీర్- వ్య‌క్తిగ‌త జీవిత ప్ర‌యాణం గురించి తెలిసిందే. ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా భ‌గీర‌థ ప్ర‌య‌త్నంతో అనుకున్న‌ది సాధించుకుంటోంది సామ్. త‌న ప‌ట్టుద‌ల‌, హార్డ్ వ‌ర్క్ అభిమానుల‌కు స్ఫూర్తినిస్తోంది. స‌మంత ప్ర‌స్తుతం సొంత బ్యాన‌ర్ లో 'బంగారం' అనే సినిమా చేస్తోంది. అదే స‌మ‌యంలో రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న 'రక్త్ బ్ర‌హ్మాండ్' అనే వెబ్ సిరీస్ లోను న‌టిస్తోంది. తుంబాద్ ఫేం అనీల్ బార్వే దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కెరీర్ ప‌రంగా తిరిగి బిజీ బిజీగా మారుతోంది.

ఇంత‌లోనే ఇప్పుడు స‌మంత‌ తన సోదరుడు డేవిడ్ వివాహానికి ఎటెండ‌యింది. అందుకు సంబంధించిన అందమైన ఫోటోలను షేర్ చేయ‌డంతో సామ్ తాజా వ్య‌వ‌హారం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ పెళ్లిలో స‌మంత‌ అద్భుతమైన పర్పుల్ శాటిన్ గౌనులో క‌నిపించింది. పెళ్లిలో ప్రకాశవంతమైన స‌మంత‌ రూపాన్ని అభిమానులు ప్రశంసించారు. ఈ పెళ్లి నుంచి స‌మంత ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. కొంద‌రు బంధుమిత్రుల‌తో క‌లిసి స‌మంత ఫోటోలు దిగిన‌వి ఇందులో ఉన్నాయి.

ఈ ఫోటోలను సామ్ షేర్ చేసిన వెంటనే అభిమానులు కామెంట్ సెక్షన్‌లో ప్రేమను కురిపించారు. ఒకరు ''హోలీ మోలీ'' అని... 'మీరు డ్రాప్ డెడ్ గార్జియస్' అని అభిమానులు ప్ర‌శంసించారు. 'ది గార్జియస్ గర్ల్ ఇన్ ది సెషన్' అని మ‌రొక అభిమాని ప్ర‌శంసించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కొద్దిపాటి విరామం తర్వాత సమంత రూత్ ప్రభు తిరిగి సెట్స్ లోకి వచ్చారు. ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి తన కొత్త టీవీ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్‌ చిత్రీకర‌ణ‌లో పాల్గొంటున్నారు. అనీల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. తుంబాద్ లాంటి జాతీయ అవార్డ్ సినిమాని తెర‌కెక్కించిన అనిల్ బార్వే ద‌ర్శ‌క‌త్వంలో డి2ఆర్ ఫిల్మ్స్ లో 'ది ఫ్యామిలీ మ్యాన్' సృష్టిక‌ర్త‌లు రాజ్ & డికె ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే అధికారికంగా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. ప్ర‌తిభావంతులైన తారాగణంలో సమంతా, ఆదిత్య రాయ్ కపూర్‌లతో పాటు అలీ ఫజల్ , వామికా గబ్బి న‌టిస్తున్నారు.