Begin typing your search above and press return to search.

ఆ వీడియో క్లిప్.. సామ్ ఒక్కసారిగా షాక్!

ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకునే.. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో చిట్ చాట్స్ కూడా చేస్తుంటుంది అమ్మడు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 9:39 AM GMT
ఆ వీడియో క్లిప్.. సామ్ ఒక్కసారిగా షాక్!
X

స్టార్ హీరో సమంత.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై కనిపించి కాస్త గ్యాప్ వచ్చినా.. తన ఫ్యాన్స్ తో మాత్రం నెట్టింట టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకునే.. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో చిట్ చాట్స్ కూడా చేస్తుంటుంది అమ్మడు.


తాజాగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో కాసేపు నెటిజన్లుతో ముచ్చటించిన సామ్.. పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఆ సమయంలో ఓ వీడియోను చూసిన విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఇంటర్నెట్ డూమ్స్‌ డే సిద్ధాంతానికి చెందిన ఆ వీడియో తనను తీవ్రంగా కలిచి వేసిందని, అనేక ఆందోళనలను లేవనెత్తిందని చెప్పింది సమంత.

అంతే కాకుండా.. తనను భయానక అనుభూతికి గురి చేసిందని తెలిపింది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బెస్ట్‌ హీరోయిన్‌ ఎవరన్న క్వశ్చన్ కు.. పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయి పల్లవి (అమరన్‌), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్‌ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్ఎల్‌) పేర్లను సమంత చెప్పడం విశేషం.


వీరంతా రాక్‌ స్టార్స్‌ అని, ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మరో వీడియో చేస్తానని క్యూట్ గా నవ్వుతూ తెలిపింది సామ్. నెగెటివ్‌ ఆలోచనలను ఎలా అధిగమిస్తుంటారని అడగ్గా.. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చేయనని, రెగ్యులర్‌ గా చేసే మెడిటేషన్‌ తదితర వాటి వల్ల నెగెటివిటీ దూరం అవుతుందనుకుంటున్నాని చెప్పి ఆకర్షించింది.

మీరు తిరిగి వచ్చేయండని అనగా... తప్పకుండా మళ్లీ తిరిగి వస్తున్నా బ్రో అని చెప్పింది సమంత. రీసెంట్ గా కొద్ది రోజులపాటు ఫోన్ కు దూరంగా ఉన్నానని, మొబైల్‌ లేకపోవడంతో మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించిందని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం సామ్ చిట్ చాట్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి.


ఇక సామ్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. రీసెంట్ గా సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో వచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తన యాక్టింగ్ తో ఓ రేంజ్ మెప్పించిన ఆమె.. ఇప్పుడు రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌ డమ్‌ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. అదే సమయంలో కొన్ని నెలల క్రితం తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై మా ఇంటి బంగారం మూవీ ప్రకటించినా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు.