సమంత సినిమాకు వాళ్ల సపోర్ట్..?
స్టార్ హీరోయిన్ గా సమంత టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. ఐతే ఈసారి కొత్తగా నిర్మాతగా తన ప్రతిభ చాటాలని చూస్తుంది సమంత.
By: Tupaki Desk | 18 March 2025 7:00 AM ISTస్టార్ హీరోయిన్ గా సమంత టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు. ఐతే ఈసారి కొత్తగా నిర్మాతగా తన ప్రతిభ చాటాలని చూస్తుంది సమంత. ట్రాలాలా ప్రొడక్షన్ స్థాపించి సమంత తన మొదటి ప్రొడక్షన్ లో సినిమా పూర్తి చేసింది. శుభం అనే టైటిల్ తో ఒక కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది అమ్మడు. సమంత నిర్మాతగా సినిమా అనగానే ఆడియన్స్ లో ఒక అటెన్షన్ ఏర్పడింది. టైటిల్ కూడా శుభం అని తెలియగానే ఏదో తెలియని ఫీలింగ్.
ఐతే సమంత ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సమంత శుభం సినిమా పోస్టర్ రిలీజ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంది. సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతూ వారు శుభం పోస్టర్ స్టేటస్ లో పెట్టారు. ఐతే దాన్ని చూసి సమంత తొలి సినిమాను మైత్రి వారి ద్వారా రిలీజ్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు.
లుకింగ్ ఫార్వర్డ్ అంటూ మైత్రి మేకర్స్ మెసేజ్ పెట్టడం చూస్తే నిజంగానే సమంత శుభం సినిమా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. సినిమా బండి మేకర్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ శుభం సినిమాలో అందరు యువ నటీనటులు నటిస్తున్నారు. కంటెంట్ బాగుంటే అందులో ఉన్నది ఎవరైనా సరే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు.
సో అలా చూస్తే సమంత శుభం సినిమాకు కొత్త వాళ్లు అనే భావన ఉండకపోవచ్చు. అదీగాక సమంత నిర్మాణంలో వస్తున్న తొలి సినిమా కాబట్టి ఆమె కూడా తన పూర్తి ఫోకస్ దీని మీదే పెట్టి ఉండొచ్చని అంటున్నారు. సో మైత్రి మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ లోనే సమంత శుభం వస్తుందా.. హీరోయిన్ తొలి సినిమాకు వారి సపోర్ట్ ఉందా అన్నది తర్వాత తెలుస్తుంది. సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి అమ్మడు బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. తెలుగులో ఛాన్స్ లు వస్తున్నా కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదని టాక్.
ఐతే సమంత ఫ్యాన్స్ మాత్రం ఆమె మళ్లీ ఇక్కడ వరుస సినిమాలు చేయాలని కోరుతున్నారు. సమంత లీడ్ రోల్ లో ట్రాలాలా ప్రొడక్షన్ లోనే మా ఇంటి బంగారం అంటూ ఒక సినిమా పోస్టర్ వదిలారు కానీ ఆ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.