Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సాకి కోసం సింపుల్ గా స‌మంత‌

ఇదిలా ఉంటే స‌మంత సినిమాల‌తో పాటూ కొన్ని వ్యాపార సంస్థ‌లు కూడా న‌డుపుతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Jan 2025 7:16 AM GMT
ఫోటో స్టోరీ: సాకి కోసం సింపుల్ గా స‌మంత‌
X

ఏ మాయ చేశావే సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చిన స‌మంత రూత్ ప్ర‌భు మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా పేరు తెచ్చుకోవ‌డంతో పాటూ ఎంతో మంది ప్రేక్ష‌కుల్ని త‌న అభిమానులుగా మార్చుకుంది. ఆ సినిమా హిట్ అవ‌డం దానికి అదృష్టం కూడా క‌లిసి రావ‌డంతో స‌మంత త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.


స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన సమంత నాగ‌చైత‌న్యను ప్రేమించి పెళ్లి చేసుకుని, కొంత కాలం త‌ర్వాత ప‌ర‌స్పర ఒప్పందంతో అత‌ని నుంచి విడాకులు తీసుకుంది. ఇదిలా ఉంటే స‌మంత సినిమాల‌తో పాటూ కొన్ని వ్యాపార సంస్థ‌లు కూడా న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. ఏకామ్ అనే ప్రీ స్కూల్ తో పాటూ సాకి అనే ఫ్యాష‌న్ బ్రాండ్ ను మొద‌లుపెట్టి స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ చేస్తోంది.


క‌రోనా టైమ్ లో ఈ క్లాత్ బ్రాండ్ ను స్టార్ట్ చేసిన స‌మంత దాని కోసం ఎన్నో క‌ల‌లు క‌ని మ‌రీ సాకిని మొద‌లుపెట్టినట్టు గ‌తంలో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సాకికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కూడా తానే వ్య‌వ‌హ‌రిస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, సాకికి సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ ఉంటుంది.

తాజాగా సాకికి సంబంధించిన వ‌ర్క్ డే అంటూ ఇన్‌స్టాలో ఒక ఫోటోను షేర్ చేసింది స‌మంత‌. ఆ ఫోటోలో స‌మంత చాలా సింపుల్ గా కుర్తా, కింద లూజ్ ప్యాంట్ ధ‌రించి చాలా నార్మ‌ల్ హెయిర్ స్టైల్ తో చేతిలో కొన్ని డైరీల‌ను ప‌ట్టుకుని ఉంది. ఇక కెరీర్ విష‌యానికొస్తే స‌మంత రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగులో గ‌తేడాది మా ఇంటి బంగారం సినిమాను సొంత బ్యాన‌ర్ లో అనౌన్స్ చేసిన స‌మంత ఇప్ప‌టివ‌ర‌కు దాని గురించి మ‌ళ్లీ అప్డేట్ ఇవ్వ‌లేదు.