Begin typing your search above and press return to search.

అదే ఎందుకో అతి త్వ‌రలోనే!

ఇందులో స‌మంత అతిధి పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా సెట్స్ కి వెళ్లి కొన్ని నెల‌లు గడుస్తోంది. అటుపై ఎలాంటి అప్ డేట్ లేదు.

By:  Tupaki Desk   |   16 March 2025 12:06 PM IST
అదే ఎందుకో అతి త్వ‌రలోనే!
X

స‌మంత ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ పేరుతో కొత్త‌గా చిత్ర నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన సంగ‌తి తెలిసిందే. నూత‌న న‌టీన‌టులతో 'శుభం' అనే టైటిల్ తో చిత్రాన్ని నిర్మిస్తుంది. 'సినిమా బండి' ఫేం ప్ర‌వీణ్ కండ్రే గుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో స‌మంత అతిధి పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా సెట్స్ కి వెళ్లి కొన్ని నెల‌లు గడుస్తోంది. అటుపై ఎలాంటి అప్ డేట్ లేదు.

ఈ నేప‌థ్యంలో స‌మంత సినిమా విష‌యాల్ని వెల్ల‌డించింది. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాల‌తో ముడి పెట్టి తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. షూటింగ్ పూర్త‌యింది. ట్రాలాలా బ్యాన‌ర్లో ఈ క‌థ‌ను సినిమాగా ఎందుకు ఎంచుకున్నానో అతి త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని' తెలిపింది. అలాగే స‌మంత మా ఇంటి బంగారం అంటూ మ‌రో చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. ఆ ప్రాజెక్ట్ వివ‌రాలు మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

మొత్తానికి స‌మంత నిర్మాత‌గా ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచే చిత్ర‌మే అందించేలా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ న‌టిగానే కొన‌సాగిన సమంత‌ భ‌విష్య‌త్ లో మ‌రిన్ని మంచి చిత్రాలు నిర్మించాల‌ని ఆకాక్షిస్తున్నారు. ఇక స‌మంత కెరీర్ సంగ‌తి చూస్తే? కొంత కాలంగా బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టి ప‌నిచేస్తోంది.

ప్ర‌స్తుతం 'ర‌క్త బ్ర‌హ్మాండ్' అనే వెబ్ సిరీస్లో న‌టిస్తోంది. ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ అవతార్‌లో క‌నిపిస్తుంది. ఇక సినిమాల ప‌రంగా చూస్తే ఇంత‌వ‌ర‌కూ బాలీవుడ్ కొత్త ఛాన్సులేవి అందుకోలేదు. ప్ర‌య‌త్నాలు చేస్తుంది గానీ ఫ‌లించ‌డం లేదు. తెలుగులో చాన్సులొచ్చినా అమ్మ‌డు స్కిప్ కొడుతుంది.