అతని 'ఆవేశం' చూసి భయపడిన సమంత!
నెట్టింట ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఫహాద్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో నటి సమంత కూడా రివ్యూ ఇచ్చింది.
By: Tupaki Desk | 24 April 2024 11:18 AM GMTదక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు ఫహాద్ ఫాజిల్. పాత్రల పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడుతుంటారాయన. హీరోగా మలయాళంలో బిజీగా ఉంటూనే పుష్పతో పాటు పలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. పుష్ప మూవీతో తెలుగులో మంచి ఫేమ్ కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు పుష్ప-2లో భన్వర్ సింగ్ షెకావత్ గా మరికొద్ది రోజుల్లో అలరించనున్నారు.
ఇటీవల ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ఆవేశం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2024లో మాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు రూ.100 కోట్ల వసూళ్లను అందుకుంది. ఫహాద్ కెరీర్ లో రూ.100 కోట్ల మార్క్ ను సాధించిన తొలి మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
గ్యాంగ్ స్టర్ కమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను రొమాంచం ఫేమ్ జీతూ మాధవన్ తెరకెక్కించారు. రంగా అనే గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లో ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్ తో పాటు కామెడీ టైమింగ్ కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. నెట్టింట ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఫహాద్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో నటి సమంత కూడా రివ్యూ ఇచ్చింది.
"ఆవేశం మూవీ అన్ని రకాల మ్యాడ్ నెస్ తో కూడుకున్నది. ఆ మ్యాడ్ నెస్ నాకెంతగానో నచ్చేసింది. ఈ మూవీ అన్ని రూల్స్ ను బ్రేక్ చేసింది. సీన్, సీన్ కు మధ్య జానర్లు మార్చేశారు. ఈ మూవీ చూసి భయపడ్డాను, నవ్వుకున్నాను. కొన్ని సీన్స్ కు భయపడుతూ నవ్వుకున్నాను. కొన్ని సినిమాలను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే. అలాంటి వాటిలో ఆవేశం ఒకటి. ఫహాద్ ఫాజిల్ సినిమాలను ఎవరూ మిస్ కాకండి"
"ఫహాద్ ఫాజిల్ సినిమాలు కచ్చితంగా వినోదాన్ని పంచుతాయి. ఆవేశం టీమ్ అందరికీ కంగ్రాట్స్. మీరంతా ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా నిలిచారు" అని సామ్.. ఆవేశం పోస్టర్ ను షేర్ చేస్తూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. ఇక సమంత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ సిరీస్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో చూడాలి.