Begin typing your search above and press return to search.

సామ్ బ్రేక్.. ఎంత ఆదాయం పోతుందో తెలుసా?

సమంత కేవలం ఒక్క సంవత్సరం గ్యాప్ తీసుకోవడం వల్ల రూ.30కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిసి ఫ్యాన్స్ షాకౌతున్నారు

By:  Tupaki Desk   |   22 July 2023 2:41 PM GMT
సామ్ బ్రేక్.. ఎంత ఆదాయం పోతుందో తెలుసా?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియనివారు ఎవరూ ఉండరేమో. ఆమె దాదాపు దశాబ్ధానికి పైగా సినిమాలు చేస్తూ, దక్షిణాది ప్రజలను అలరిస్తూ వస్తున్నారు. ఆమెకు రోజు రోజుకీ క్రేజ్ పెరుగుతుందే కానీ, తగ్గుతున్నది లేదు. ముఖ్యంగా, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌లో తన నటనతో జాతీయ దృష్టిని ఆకర్షించినప్పటి నుండి సమంత క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది.

అయితే, ఆమె తన అనారోగ్య కారణాల వల్ల సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నా కూడా ఆమె మాత్రం సినిమాలు చేయడానికి అస్సలు సముఖతగా లేరు. ఆమె తన ఆరోగ్యం పూర్తిగా సెట్ అయ్యే వరకు మళ్లీ ఎలాంటి సినిమా చేయాలని అనుకోవడం లేదు.

అయితే, ఈ బ్రేక్ కి ముందు సమంత తన పారితోషకం పెంచేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఆమె తన రెమ్యూనరేషన్ ని రూ.10 కోట్లకు పెంచేసింది. ఆమె చివరగా ఖుషీ, సిటాడెల్ ల కోసం రూ.5 కోట్లు తీసుకుంది.

అయితే, తాను ప్రస్తుతం సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోవడంతో దాదాపు సమంత రూ30కోట్లు నష్టపోవాల్సి రావడం గమనార్హం. చేతిలో ఉన్న సినిమాలను వదులుకోవడంతో పాటు, ఆమె చేతిలో ఉన్న బ్రాండ్స్ కి కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది.

దీంతో, సమంత కేవలం ఒక్క సంవత్సరం గ్యాప్ తీసుకోవడం వల్ల రూ.30కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిసి ఫ్యాన్స్ షాకౌతున్నారు, అయితే, ఆమె ఆరోగ్యం కంటే, ఈ డబ్బు ఎక్కువ కాదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, సమంత మూవీలకు బ్రేక్ ఇచ్చినా, ఆమె క్రేజ్ మాత్రం బాగా పెరిగింది. ఓర్మాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో సమంత ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె అగ్ర తారలను వెనక్కి నెట్టి, మొదటి స్థానంలోకి చేరడం విశేషం. దేశంలోని స్టార్ల టాప్ ర్యాంకింగ్స్ ఇక్కడ ఉన్నాయి. వరుసగా సమంత (1) అలియా భట్ (2), దీపికా పదుకొణె (3), నయనతార (4), కాజల్ అగర్వాల్ (5) ఉన్నారు. టాప్ 10 జాబితాలో త్రిష (6), కత్రినా కైఫ్ (7), కియారా అద్వానీ (8), కీర్తి సురేష్ (9), రష్మిక మందన్న (10) చోటు దక్కించుకోవడం విశేషం.