స్నేహితురాలితో కలిసి సామ్ ఇన్నోవేషన్
స్పాట్ నుంచి నిరంతరం తన ఇన్నోవేషన్ గురించిన విజ్ఞానాన్ని సమంత తన అభిమానులకు సోషల్ మీడియాల ద్వారా షేర్ చేస్తోంది.
By: Tupaki Desk | 9 Nov 2023 4:22 AM GMTక్వీన్ సమంత వరుస పర్యటనలతో ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు మయోసైటిస్ చికిత్స కోసం ఎక్కువ విరామం కావాలని భావించిన సమంత రిలాక్స్ థెరపీలతో ప్లెజెంట్ ట్రిప్ లను ప్లాన్ చేస్తోంది. ఇంతకుముందు బాలి -ఆస్ట్రియా వంటి చోట్ల రిజనొవేషన్ పర్యటనలను పూర్తి చేసిన సమంత ఇప్పుడు సుదీర్ఘ కాలం భూటాన్ లో పర్యటించనుందని తెలిసింది. మయోసిటిస్ పరిస్థితి నుండి పూర్తిగా కోలుకోవడానికి ఆమె ఒక సంవత్సరం పని నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నందున ఆమె తన పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఈ ట్రిప్ ని ప్లాన్ చేసినట్టు తెలిసింది.
స్పాట్ నుంచి నిరంతరం తన ఇన్నోవేషన్ గురించిన విజ్ఞానాన్ని సమంత తన అభిమానులకు సోషల్ మీడియాల ద్వారా షేర్ చేస్తోంది. అందుకు సంబంధించిన గ్లింప్స్ వేగంగా అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకూ పలుమార్లు డిటాక్స్ టూర్లను ప్లాన్ చేసిన సమంత ఈసారి కూడా డిటాక్సిఫికేషన్ థెరపీ తీసుకునేందుకే భూటాన్ వెళ్లింది. ఈసారి తన స్నేహితురాలు క్రేషా బజాజ్‌తో కలిసి ఈ టూర్ కి వెళ్లారని తెలిసింది. ఆ ఇద్దరు మిత్రులు ఆసియాలోని బౌద్ధ రాజ్యమైన భూటాన్ లో సుదీర్ఘ కాలం స్పెండ్ చేయనున్నారు.
ఇటీవల భూటాన్ నుండి ప్రతి అప్‌డేట్‌ను సమంత షేర్ చేస్తోంది. అవసరమైన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. అక్కడ నేర్చుకున్న పరిశీలించిన విషయాలను వెల్లడిస్తూ కావాల్సినంత వినోద విజ్ఞానాన్ని పంచుకుంటోంది. ఒకరకంగా సామ్ గొప్ప ట్రావెల్ వ్లాగర్‌గా మారింది. ముఖ్యంగా ఆమె భూటాన్‌లోని వివిధ పద్ధతుల గురించి, వస్త్రాలు ఎలా తయారు చేస్తారు? అనే దాని గురించి చెబుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే సమంత నటించిన ఖుషి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లోను నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.