Begin typing your search above and press return to search.

స‌మంత ఆయ‌న‌కే లిప్ట్ ఇస్తుందా?

ఈ నేప‌థ్యంలో స‌మంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌స్తుంది. మ‌ల‌యాళంలో ఓ సినిమాకి సైన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2024 12:41 PM GMT
స‌మంత ఆయ‌న‌కే లిప్ట్ ఇస్తుందా?
X

స‌మంత అమెరికా నుంచి తిరిగొచ్చి నెల‌లు గ‌డుస్తోంది. కానీ ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది లేదు. కానీ స‌మంత కున్న క్రేజ్ తో అవ‌కాశాలు పెద్ద క‌ష్టం కాదు. ఆమె ఆచితూచి అడుగులు వేస్తుంది. కొడితే కుంభ స్థ‌లాన్నే కొట్ట‌ల‌ని సీరియ‌స్ గా ఉంది. బాలీవుడ్ లో సీరియస్ గా ట్రై చేస్తుంద‌ని చాలా కాలంగా వినిపిస్తుంది కానీ ఇంత‌వ‌ర‌కూ అక్క‌డా ఒక్క ప్రాజెక్ట్ కి కూడా అధికారికంగా సైన్ చేసింది లేదు. ఇటు తెలుగులోనూ కొత్త సినిమాలు వేటికి క‌మిట్ అవ్వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో స‌మంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌స్తుంది. మ‌ల‌యాళంలో ఓ సినిమాకి సైన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అందులో మమ్ముట్టి కి జోడీగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఆ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. సామ్ స‌హా గౌత‌మ్ కి అక్క‌డ ఇదే తొలి ప్రాజెక్ట్. ఇంత‌వ‌ర‌కూ ఇద్ద‌రు అక్క‌డ సినిమాలు చేసింది లేదు. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ఇదే నిజ‌మైతే గౌత‌మ్ మీన‌న్ కే స‌మంత ఛాన్స్ ఇచ్చిన‌ట్లు అవుతుంది.

ఎందుకంటే గౌత‌మ్ మీన‌న్ కి ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతో చాలా కాలంగా ఆయ‌న న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. చిన్న చిన్న పాత్ర‌లు సైతం పోషిస్తున్నాడు. బేసిక్ గా న‌ట‌నంటే ఆస‌క్తే. కానీ ఒక‌ప్ప‌డు స్టార్ డైరెక్ట‌ర్ గా వెలిగిన గౌత‌మ్ మీన‌న్ అలాంటి పాత్ర‌లు పోషించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇలాంటి ఫేజ్ లో స‌మంత మ‌ళ్లీ అత‌నితో సినిమా చేయ‌డం ఇంట్రెస్టింగ్. స‌మంత‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది గౌత‌మ్ మీన‌న్ అన్న సంగ‌తి తెలిసిందే.

`ఏమాయ చేసావే` సినిమాతో ఆయ‌నే హీరోయిన్ గా టాలీవుడ్ లో లాంచ్ చేసాడు. ఆ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డంతో స‌మంత క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఒక్క విజయం స‌మంత జీవితాన్నే మార్చేసింది. అక్క‌డ నుంచి త‌మిళ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఫేమ‌స్ అయింది. అక్కినేని ఇంట కోడ‌లి స్థానాన్ని సైతం క‌ట్ట‌బెట్టింది. చైత‌న్య‌తో విడిపోవ‌డం అన్న‌ది వేరే సంగ‌తి అనుకోండి.