Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోతో సామ్.. ఇలా బిజీ బిజీగా..

అయితే ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత.

By:  Tupaki Desk   |   1 Jun 2024 10:45 AM GMT
బాలీవుడ్ హీరోతో సామ్.. ఇలా బిజీ బిజీగా..
X

హీరోయిన్ సమంతను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా నెలలు అవుతోంది. చివరగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌ లో రిలీజైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఖుషి మూవీలో సామ్ కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయింది. కొన్ని నెలల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ సమంత.. ఫుల్ రెస్ట్ తీసుకుంది. కొండలు, కోనలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడిపింది. రీసెంట్ గా ఇండియా వచ్చింది.

అయితే ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్మెంట్ రాలేదు. అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ గా సమంత సిరీస్ వస్తోంది. దీంతోపాటు మరో సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ.

దీంతో సమంతను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో ఓ యాడ్ లో కనిపించింది. ఫేమస్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో తెరకెక్కించిన యాడ్ లో సందడి చేసింది. టీ 20 వరల్డ్ కప్ కు గాను టీం ఇండియాకు విషెస్ చెబుతూ జొమాటో యాడ్ ను పోస్ట్ చేసింది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

యాడ్ లో రణవీర్ సింగ్, సమంతతో పాటు అంతా ఇండియా మ్యాచ్ చూస్తుంటారు. ఆ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. అలా ఫుడ్ ను తింటూ మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో ఇప్పుడు టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడమే కావాలని, మరేం లేదని సమంత, రణవీర్ చెబుతారు. ఇక ఆ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తుంది. దీంతో ఇండియా ఇండియా అంటూ ఉత్సాహంగా అరుస్తూ సంబరపడిపోతారు.

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ యాడ్.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రపంచ కప్ ను టీమ్ ఇండియా కచ్చితంగా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు ప్రతిబింబించేలా రూపొందింది. రణవీర్ సింగ్, సమంత ఇద్దరూ స్క్రీన్ పై నవ్వుతూ సందడి చేశారు. హగ్ చేసుకుంటూ ముచ్చటగా కనిపించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టైమ్ లో కూడా జొమాటో తీసిన యాడ్ లో సమంత నటించింది.

మొత్తానికి యాడ్ లో సమంతను చూసి ఆమె ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమాతో ఉన్న సమంత.. వరుస అవకాశాలను దక్కించుకోవాలని ట్రై చేస్తోంది. బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తోంది. త్వరలోనే సిటాడెల్ తో బీ టౌన్ లో అలరించనుంది. ఇప్పుడు జొమాటో యాడ్ లో కనిపించింది. అలా ఏదో విధంగా బాలీవుడ్ లో బిజీ గా గడుపుతోంది.