సామ్ కిల్లర్ లుక్.. గ్లామర్ డోస్ మామూలుగా లేదు
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
By: Tupaki Desk | 31 March 2024 12:23 PM GMTసౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత చివరిగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విజయ్ దేవరకొండకి జోడీగా ఈ చిత్రంలో సమంత నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఒక్క తెలుగులోనే పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. మిగిలిన భాషలలో అంతగా ప్రభావం చూపించలేదు. తరువాత సినిమాల నుంచి సమంత కొంత విరామం తీసుకుంది.
మాయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకోవడంతో కొంతకాలం పాటు శారీరక, మానసిక ప్రశాంతత కావాలని యాక్టింగ్ కి రెస్ట్ ఇచ్చింది. కాస్త రికవరీ కావడంతో మరల ఇప్పుడు కెరియర్ పై ఫోకస్ పెట్టింది. రెగ్యులర్ గా ఫోటోషూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రంగం సిద్ధం అయ్యింది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో కూడా సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం సమంత ఫోకస్ బాలీవుడ్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది. సిటాడెల్ రిలీజ్ అయితే బాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతాయనే కాన్ఫిడెంట్ తో సమంత ఉందని టాక్. అలాగే హిందీలో కొన్ని సినిమాలకి సంబంధించి కథలు కూడా వింటుందంట.
బాలీవుడ్ పై సమంత ఫోకస్ చేసిన నేపథ్యంలో ఫోటోషూట్ లలో కూడా ఆమె స్పీడ్ పెంచింది. గ్లామర్ షో విషయంలో కూడా సరికొత్తగా గ్లామర్ తో హీట్ పెంచే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది. తాజాగా సమంత బ్లాక్ కలర్ షూట్ ని భుజం మీద వేసుకొని స్టైలిష్ గా కూర్చొని ఉన్న ఘాటైన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఫోటో పెట్టి ఒక గంట సమయం కూడా పూర్తి కాకుండా ఏకంగా 2.51 లక్షల మంది లైక్ చేయడం విశేషం. దీనిని బట్టి సమంతకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సమంత ఈ లుక్ లో తనని తాను ప్రెజెంట్ చేసుకోవడం విశేషం. ఇదే స్థాయిలో హాట్ షో చేస్తూ ఉంటే కచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ మూవీస్ లో ఛాన్స్ అందుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.