Begin typing your search above and press return to search.

వైరల్‌ : చిన్మయి పిల్లలతో సమంత చేసిన పని..!

చిన్మయి కొడుకు తో ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా వీడియో ను చేసి షేర్ చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 11:14 AM GMT
వైరల్‌ : చిన్మయి పిల్లలతో సమంత చేసిన పని..!
X

అనారోగ్య సమస్యలు.. ఇతర కారణాల వల్ల దాదాపు ఏడాది సమయం పాటు సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతున్నట్లుగా ప్రకటించింది. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ ను ముగించిన సమంత కనీసం ఆ రెండు ప్రాజెక్ట్‌ లు పూర్తి అయ్యే వరకు కూడా ఉండకుండా విహార యాత్రకు వెళ్లి పోయింది. సినిమాలకు బ్రేక్ తీసుకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ పోస్ట్‌ లతో సందడి చేస్తోంది.

కొన్ని రోజుల క్రితం స్నేహితురాలితో కలిసి బాలి వెళ్లిన సమంత అక్కడ వాతావరణంను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో తెగ ఫోటోలు వీడియోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సమంత చాలా యాక్టివ్ గా సంతోషంగా కనిపిస్తుందని ఆమె అభిమానులు సైతం మాట్లాడుకున్నారు.

చాలా రోజుల పాటు బాలిలో సందడి చేసిన సమంత ఇటీవల తిరిగి చెన్నై చేరింది. చెన్నై లో తన స్నేహితురాలు అయిన చిన్మయి శ్రీపాద ఇంటికి వెళ్లింది. గత ఏడాది రాహుల్‌, చిన్మయి దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ పిల్లల ఫోటోలు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సమంత తాజాగా చిన్మయి ఇంటికి వెళ్లి ఆమె కవల పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపింది. వారిద్దరితో ఆడుకుంటూ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. చిన్మయి కొడుకు తో ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా వీడియో ను చేసి షేర్ చేయడం జరిగింది.

సమంత షేర్ చేసిన వీడియోలు... చిన్మయి పిల్లల క్యూట్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. చిన్మయి పిల్లలతో సమంత చేసిన ఫన్‌ వీడియోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు సమంత కూడా చాలా యాక్టివ్‌ గా కనిపిస్తుందని టాక్ వచ్చింది.