Begin typing your search above and press return to search.

తండ్ర‌యిన యువ‌హీరోకి స‌మంత శుభాకాంక్ష‌లు

బాలీవుడ్ యువ‌హీరో వ‌రుణ్‌ధావ‌న్ తండ్ర‌య్యాడు. వరుణ్ ధావన్ - నటాషా దలాల్ ఇప్పుడు తల్లిదండ్రులు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 5:14 AM GMT
తండ్ర‌యిన యువ‌హీరోకి స‌మంత శుభాకాంక్ష‌లు
X

బాలీవుడ్ యువ‌హీరో వ‌రుణ్‌ధావ‌న్ తండ్ర‌య్యాడు. వరుణ్ ధావన్ - నటాషా దలాల్ ఇప్పుడు తల్లిదండ్రులు. ఈ ఆనంద స‌మ‌యాన తన కుమార్తె పుట్టిన విషయాన్ని ధావ‌న్ బోయ్ అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించాడు. అతడు త‌న కుమార్తె పేరును ప్రస్థావించలేదు కానీ పోస్ట్‌లో ఆమెను `బేబీ ధావన్` అని పిలిచాడు. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో వరుణ్‌కి ఇష్టమైన పెంపుడు కుక్క జోయి కూడా ఉంది. బెలూన్.. దాని చుట్టూ పువ్వులు శిశువు కోసం బహుమతులు ఈ ఫోటోలో ఉన్నాయి. శిశువు పుట్టిన తేదీ 3 జూన్ 2024గా పేర్కొన్నారు. వరుణ్ -నటాషా కుటుంబం గోప్యత కోసం మీడియాను స‌హ‌క‌రించాల్సిందిగా కోరింది. వరుణ్ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో, ``మా అమ్మాయి ఇక్కడ ఉంది. త‌ల్లి బిడ్డల‌కు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అన్నాడు. ``హరే రామ హరే రామ రామ రామ‌ హరే హరే.. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే..`` అంటూ ఇస్కాన్ మంత్రాన్ని జపించాడు.

ఈ జంటకు బిడ్డ జ‌న్మించింది అన‌గానే ప్రియాంక చోప్రా, స‌మంత రూత్ ప్ర‌భు శుభాకాంక్షలు తెలిపారు. పరిణీతి చోప్రా కూడా ధావ‌న్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ సిటాడెల్ సహనటి సమంతా రూత్ ప్రభు ఇలా రాశారు. ``అత్యుత్తమ వార్తలు. మీ ఇద్దరికీ అభినందనలు``అని రాసారు.

శుభవార్త తెలిసిన వెంటనే, పరిశ్రమకు చెందిన వరుణ్ సన్నిహితులు, కరణ్ జోహార్ -అర్జున్ కపూర్, వారి సంబంధిత సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలిపారు. నా బిడ్డకు ఆడపిల్ల పుట్టింది! నేను మూర్ఖంగా ఉన్నాను!! గ‌ర్వంగా ఉన్న త‌ల్లిదండ్రుల‌కు పాపకు అభినందనలు!!! లవ్ యు నటాషా, వరుణ్ అని కరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. బిడ్డ పుట్టిన వార్త బ‌య‌టికి వ‌చ్చేప్ప‌టికి వరుణ్ ధావన్ ముంబైలోని హిందూజా ఆసుపత్రి వెలుపల కనిపించాడు. అత‌డు తన తండ్రి, ద‌ర్శ‌క‌నిర్మాత డేవిడ్ ధావన్‌తో కలిసి నడుస్తూ క‌నిపించాడు. ఆసుపత్రి నుండి నిష్క్రమిస్తున్నప్పుడు ఉప్పొంగిన తాత డేవిడ్ ధావన్ పై ఫోటోగ్రాఫర్‌లు ఫ్లాష్‌లు మెరిపించారు.

2021లో పెళ్లి చేసుకున్న నటాషా-వరుణ్ ధావ‌న్ ఫిబ్రవరిలో గర్భం గురించి ప్రకటించారు. వారు నటాషా బేబీ బంప్‌పై వరుణ్ ముద్దు పెడుతున్న‌ అందమైన ఫోటోను పోస్ట్ చేశారు.