Begin typing your search above and press return to search.

సమంత.. హార్ట్ బ్రేక్ పోస్ట్ వైరల్

అయితే, సమంత మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా ఇదే టైమ్ లో వినేష్ ఫొగట్‌కు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియాలో స్పందించింది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 1:20 PM GMT
సమంత.. హార్ట్ బ్రేక్ పోస్ట్ వైరల్
X

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఇప్పుడు ట్రెండింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాయి. వీరి వివాహ నిశ్చితార్థం వార్తలతో పాటు, గతంలో నాగ చైతన్య ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలోని వ్యాఖ్యలు, రొమాంటిక్ కామెంట్లు తిరిగి ట్రెండ్ అవుతుండటం వలన ఆయన మీద జనాల దృష్టి మరింత ఎక్కువైంది. అలాగే శోభితా బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా సోషల్ మీడియాలో రకరాలుగా కథనాలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో నాగ చైతన్య మాజీ భార్య సమంత పేరు కూడా చర్చకు దారి తీసింది. ఇద్దరు విడిపోయిన అనంతరం ఎవరి జీవితాల్లో వారు హ్యాపీగా ఉన్నారు. ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభిత మధ్య సంబంధం ఉందని పుకార్లు మరింత ఎక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సమంత ఈ నిశ్చితార్థం గురించి ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొంది.

నిజానికి సమంత స్పందించాల్సిన అవసరం లేదు. ఆమె తన లైఫ్ తో చాలా బిజీగా వుంది. కానీ ఈ టైమ్ లో ఏమైనా పోస్ట్ చేస్తే మాత్రం సోషల్ మీడియాలో తప్పకుండా వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే, సమంత మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా ఇదే టైమ్ లో వినేష్ ఫొగట్‌కు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియాలో స్పందించింది.

వినేష్ ఫొగట్ రెజ్లింగ్ పోటీలకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆమెకు మద్దతుగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్‌లో హార్ట్ బ్రోకెన్ సింబల్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూస్తే, సమంత ఇతర సమాజంలో జరిగే విషయాలపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. సమంత ఇప్పటికీ తన జీవితాన్ని స్వతంత్రంగా కొనసాగిస్తుండటంతో పాటు, తన పాత వివాహ జీవితంపై దృష్టి పెట్టకుండా ముందుకు సాగుతుండడం గమనించవచ్చు.

ఇక, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ నేపథ్యంలో ఆమె ఏమైనా పోస్ట్ చేస్తే మాత్రం ఆమె భవన తెలిసే అవకాశం ఉంది. ఇక ఆమె సోషల్ మీడియాలో నెక్ట్స్ పోస్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం సమంత సిటాడేల్ ప్రమోషన్స్ కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు ప్రాజెక్టులను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఒక బిగ్ ప్రాజెక్టు పై ఆమె నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.