Begin typing your search above and press return to search.

సామ్ బిగ్ అనౌన్స్మెంట్.. త్వరలోనే!!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2024 9:13 AM GMT
సామ్ బిగ్ అనౌన్స్మెంట్.. త్వరలోనే!!
X

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ వైరల్ అవుతోంది. ఒక్కోసారి హెల్త్ కు సంబంధించిన పోస్టులు పెడుతుంటోంది. సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించి చాలా నెలలు గడవగా.. ఇటీవల తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పై 'మా ఇంటి బంగారం' మూవీ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు.. ఆమె మయోసైటిస్ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని, చికిత్స తీసుకుంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. దీనిపై సామ్ స్పందించకపోయినా.. ఇటీవల ఈషా ఫౌండేషన్ సద్గురు వద్ద ధ్యానం చేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది. అయితే త్వరలో ఆమె యాక్ట్ చేసిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంతకుముందు ఆమె నుంచి మరో అనౌన్స్మెంట్ రానుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సమంత మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పదేళ్లకు పైగా సినిమాలు చేస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క మలయాళం మూవీలో కూడా సామ్ నటించలేదు. ఇప్పుడు మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. చెన్నైలో ఈ థ్రిల్లర్ మూవీ షూట్ ఎక్కువగా జరగనుందని టాక్.

అయితే ఈ సినిమాలో ముందు నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ఆమె తన పర్సనల్ రీజన్స్, వర్క్ కమిట్మెంట్స్ కారణంగా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంతకు ఈ బిగ్ ఆఫర్ దక్కినట్లు టాక్ వస్తోంది. ఏదేమైనా సమంత బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నట్లే. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి.

ఇక మమ్ముట్టి సినిమా నుంచి నయనతార తప్పుకోవడం వెనుక రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రోల్ పరంగా తనకు నచ్చక వదులుకుందని చెబుతున్నారు. యష్ టాక్సిక్ మూవీ చేసేందుకే.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందని అంటున్నారు. మేకర్స్ తో వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరి సమంత మాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి.