Begin typing your search above and press return to search.

సమంత 'రక్త బ్రహ్మాండ'

ఓ ఆరు నెలల పాటు షూటింగ్ లకి గ్యాప్ ఇచ్చిన సమంత మరల రాజ్ అండ్ డీకే దర్శకద్వయంతో కమిట్ అయిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసింది.

By:  Tupaki Desk   |   20 July 2024 2:27 PM GMT
సమంత రక్త బ్రహ్మాండ
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఖుషి తర్వాత సమంత కొంత గ్యాప్ తీసుకొని, ఫిజికల్ గా, మెంటల్ గా రికవరీ అవ్వడానికి షూటింగ్ నుంచి విశ్రాంతి తీసుకుంది. ఓ ఆరు నెలల పాటు షూటింగ్ లకి గ్యాప్ ఇచ్చిన సమంత మరల రాజ్ అండ్ డీకే దర్శకద్వయంతో కమిట్ అయిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసింది.

ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ప్రస్తుతం ఉందంట. ఇదిలా ఉంటే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సమంత తెలుగులో పాన్ ఇండియా మూవీగా కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో తనకి డిజిటల్ లో బ్రేక్ ఇచ్చిన రాజ్ అండ్ డీకేలతోనే మూడో వెబ్ సిరీస్ చేయడానికి సమంత రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని షూటింగ్ కి రెడీ అవుతోందంట.

రక్త బ్రహ్మాండ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు సమంత ఇందులో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందంట. అయితే సమంత పాత్ర ఎలా ఉండబోతోందనేది క్లారిటీ లేదు. ఈ వెబ్ సిరీస్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో లార్జర్ దెన్ లైఫ్ లాంటి కంటెంట్ తో తెరకెక్కబోతోందంట. భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ వెబ్ సిరీస్ కథాంశం సిద్ధం చేసారంట.

సమంత ఆగష్టు లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అవ్వనుందని తెలుస్తోంది. అప్పుడు అఫీషియల్ గా ఆమె క్యారెక్టర్ కి సంబందించిన ఏమైనా రివీల్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే సమంత బాలీవుడ్ పైన ప్రస్తుతం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై కి మకాం మార్చేసింది. అక్కడ కథలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా కొంతమంది దర్శకులు సమంతకి కథలు చెబుతున్నారంట.

ది ఫ్యామిలీ మెన్ 2 సినిమాతో డిజిటల్ స్పేస్ లో సమంత ఇప్పటికే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సిటాడెల్ వెబ్ సిరీస్ పైన కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. రక్త బ్రహ్మాండ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.