సమంతకు కొత్తగా ఆ సమస్య కూడా?
సమంతకి పూలు అంటే ఎలర్జీ అట. ఆ వాసన అస్సలు పడదంట. పూలతో ఎక్కువ సమయం గడపలేను అంటోంది. ఇదేమి పెద్ద సమస్య కాదు. చాలా మందికి పూల స్మెల్ పడదు.
By: Tupaki Desk | 31 Jan 2024 12:31 PM GMTసమంత కెరీర్ జెట్ స్పీడ్ తో సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ కాలు పెట్టినా అక్కడ సక్సెస్ అన్నట్లే సాగిపోతుంది. ప్రస్తుతం అమ్మడు విశ్రాంతిలో ఉంది. తిరిగొచ్చిన తర్వాత బాలీవుడ్ ని ఏలే దిశగా అడుగులు వేయబోతుంది. ఇప్పటికే ఓ ప్రణాళిక వేసుకుని ముందకెళ్తుంది. బాలీవుడ్ లో తన పరిచయాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటుంది. ఇలా కెరీర్ పరంగా సమంతకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆలస్యమైనా సక్సెస్ దిశగానే అడుగులు పడతాయని ధీమా ఉంది.
కానీ వ్యక్తిగత జీవితంలో అనారోగ్య సమస్యలు మాత్రం అంతే వెంటాడుతున్నాయి. మయోసైటిస్ కారణంగా ఎంతంగా ఇబ్బంది పడిందో తెలిసిందే. ఇప్పుడు విరామం తీసుకోవడానికి కారణం కూడా ఆ వ్యాధి కారణం. చికిత్స లో భాగంగా విరామం అవసరమ్వడంతో రెస్ట్ ఇచ్చింది. లేకపోతే ఈ గ్యాప్ లో మరికొన్నిసినిమాలు పూర్తిచేసేది. ఈ నేపథ్యంలో తాజాగా సమంతకు మరో అరుదైన సమస్య ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమంతకి పూలు అంటే ఎలర్జీ అట. ఆ వాసన అస్సలు పడదంట. పూలతో ఎక్కువ సమయం గడపలేను అంటోంది. ఇదేమి పెద్ద సమస్య కాదు. చాలా మందికి పూల స్మెల్ పడదు. వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. అందుకేనేమో సమంత ఇంతవరకూ ఏ సినిమాలోనూ నేచురల్ పువ్వులు పెట్టుకుని నటించలేదేమో. షూట్ లో అవసరం అనుకుంటే ప్లాస్టిక్ పువ్వులు వినియోగించి ఉంటారు.
ఈ విషయం తెలియక ఇంత కాలం సమంత ఒరిజినల్ పువ్వులతో అమ్మడు అలంకరించుకు ని నటిందనుకున్నారే. సమంత చివరిగా 'ఖుషీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డివైడ్ టాక్ తో ఆడింది. విరామంలో ఉన్న బ్యూటీ కంబ్యాక్ ఎప్పుడైనా అవ్వడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సమంతకి ఇండియాలో ఉన్న మేనేజర్లు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తు న్నారు.