Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌తో మిస్.. షారూఖ్‌తో ఫైన‌ల్

ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ స‌ర‌స‌న స‌మంత‌ న‌టించ‌నుంద‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Jun 2024 5:27 PM GMT
స‌ల్మాన్‌తో మిస్.. షారూఖ్‌తో ఫైన‌ల్
X

మ‌యోసైటిస్ నుంచి కోలుకున్న స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే చాలా కాలంగా స‌మంత బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రాలేదు. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ స‌ర‌స‌న స‌మంత‌ న‌టించ‌నుంద‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి.

స‌మంత కొంత‌కాలంగా త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు. ఇంత‌లోనే కింగ్ ఖాన్ షారుఖ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమ‌వుతోంద‌ని.. ఇది దేశభక్తి , యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ఇటీవ‌లే డుంకీతో డీసెంట్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది.

ఈ భారీ మూవీకి ఇంకా టైటిల్ ని ఖ‌రారు చేయాల్సి ఉంది. షారూఖ్ బ్యాక్ టు బ్యాక్ హిరాణీతో క‌లిసి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. షారుఖ్ త‌దుప‌రి సుహానాతో క‌లిసి కింగ్ అనే మాఫియా నేప‌థ్య‌ చిత్రంలో న‌టించాల్సి ఉంది. స‌మంత న‌టించిన సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ హ‌నీబ‌న్ని విడుద‌ల కావాల్సి ఉంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.