Begin typing your search above and press return to search.

10 కోట్లు వసూలు చేస్తున్న‌ ఏకైక‌ OTT న‌టి

బ్రిటీష్ సిరీస్ లూథర్ కి భారతీయ అనువాదం అయిన `రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌`తో డిజిటల్ రంగ ప్రవేశం చేసిన అజయ్ దేవగన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   17 Feb 2024 4:43 AM GMT
10 కోట్లు వసూలు చేస్తున్న‌ ఏకైక‌ OTT న‌టి
X

దేశంలో OTT వేదిక‌లు ప్రధాన స్రవంతి న‌టీన‌టుల‌కు విస్త్ర‌త అవ‌కాశాల్ని అందిస్తున్నాయి. వారంతా తమ కంఫర్ట్ జోన్‌ల నుండి బయటపడటానికి కెమెరా ముందు ఛాలెంజింగ్ పాత్రలను పోషించడానికి ఒక వేదికగా మారాయి. ప్ర‌యోగాత్మ‌క సిరీస్ ల‌లో ఛాలెంజింగ్ పాత్ర‌ల్లో న‌టించి భారీగా ఆర్జించ‌డానికి న‌టీన‌టుల‌కు స్కోప్ పెరిగింది. కొన్నిసార్లు సినిమా పారితోషికం కంటే ఎక్కువ‌గా ఓటీటీల‌తో ఆర్జించేస్తున్నార‌నేది తాజా స‌ర్వే.


బ్రిటీష్ సిరీస్ లూథర్ కి భారతీయ అనువాదం అయిన `రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌`తో డిజిటల్ రంగ ప్రవేశం చేసిన అజయ్ దేవగన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కేవ‌లం ఈ సిరీస్ తోనే అత‌డు మొత్తం రూ.125 కోట్లు సంపాదించాడు. అయితే OTTలో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటి ఎవరు? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

రాధికా ఆప్టే, త‌మ‌న్నా, సుస్మితాసేన్, క‌రీనా క‌పూర్ ఖాన్, ప్రియ‌మణి స‌హా ఎంద‌రో ఓటీటీ రంగంలో న‌టిస్తున్నారు. కానీ రాధికా ఆప్టే OTT స్పేస్‌లో బాగా సుపరిచితమైన పేరు. ఈ బ్యూటీ కొన్ని ప్రముఖ OTT సినిమాల‌లో న‌టించింది. సేక్రేడ్ గేమ్స్, డెవిల్, మిసెస్ అండర్‌కవర్ వంటి సిరీస్‌లలో కనిపించింది. అయితే రాధిక‌ OTTలో అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ నటి కాదు. అదే విధంగా ఆర్య కొత్త సీజన్‌తో తిరిగి అభిమానుల ముందుకు వ‌స్తున్న సుస్మితా సేన్ OTTలో అత్యధిక పారితోషికం పొందిన భారతీయ నటి కానే కాదు. సౌత్ స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా ఎన్నో సంచ‌ల‌న వెబ్ సిరీస్ ల‌లో న‌టించినా కానీ త‌న పారితోషికం రేంజు అంత పెద్ద మొత్తంలో లేదు.

సౌత్ సూప‌ర్ స్టార్ గా పాపుల‌రైన‌ సమంత రూత్ ప్రభు `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో మనోజ్ బాజ్‌పేయితో కలిసి నటించారు. ఈ సిరీస్ లో న‌టించే క్ర‌మంలోనే త‌న‌ పారితోషికం పెంచార‌ని టాక్ వినిపించింది. OTT ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధిక పారితోషికం పొందే భారతీయ నటిగా స‌మంత‌ ఉద్భవించింది. రాజ్ & DK క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్ 2లో రాజలక్ష్మి శేఖరన్ అకా రాజీ పాత్రను పోషించినందుకు రూ. 4 కోట్లు అందుకుంది. ప్ర‌ముఖ జాతీయ మీడియా ప్ర‌కారం.. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్న సిరీస్ సిటాడెల్: ఇండియా వెర్ష‌న్ కోసం రూ. 10 కోట్లు వసూలు చేసిందని తెలిసింది.

సిటాడెల్ లో వరుణ్ ధావన్‌తో సమంతా రూత్ ప్రభు తొలిసారి న‌టిస్తోంది. ప్రియాంక చోప్రా- రిచర్డ్ మాడెన్ నటించిన అమెరికన్ టీవీ సిరీస్ సిటాడెల్ కి స్పిన్-ఆఫ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ నిర్మాతలు సికందర్ ఖేర్, కే కే మీనన్, సాకిబ్ సలీమ్, ఎమ్మా కానింగ్‌ కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కీలక పాత్రల్లో పోషించారు. సమంతా రూత్ ప్రభు, రాధికా ఆప్టే, సుస్మితా సేన్‌తో పాటు OTT పరిశ్రమలో అత్యధికంగా పారితోషికాలు అందుకునే భారతీయ నటీమణులలో రసిక దుగ్గల్, శోభితా ధూళిపాళ, ప్రియమణి, గౌహర్ ఖాన్ వంటివారు ఉన్నారు.

సమంత నికర ఆస్తుల‌ విలువ

ఓ స‌ర్వే ప్ర‌కారం.. సమంత రూత్ ప్రభు నికర ఆస్తుల‌ విలువ రూ. 80 కోట్లుగా ఉంద‌ని అంచనా.తన సంపదను రియల్ ఎస్టేట్ స‌హా లగ్జరీ కార్లలో పెట్టుబడిగా పెట్టింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మినిమలిస్టిక్ స్టైల్‌లో డిజైన్ చేసిన అందమైన ఇల్లు సమంత‌కు ఉంది. 2023లో 36 ఏళ్ల సామ్ ముంబైలో రూ. 15 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. సమంతా రూత్ ప్రభు కార్ కలెక్షన్‌లో BMW 7 సిరీస్, పోర్షే కేమాన్ GTS, జాగ్వార్ XF, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ , మెర్సిడెస్ బెంజ్ G63 AMG వంటి పాపుల‌ర్ కార్లు ఉన్నాయి.