ఫోటో స్టోరి: గరుడ రెక్కల్లో చిక్కుకున్న చిట్టి గువ్వ
తాజాగా సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ దుమ్ము లేపుతోంది.
By: Tupaki Desk | 19 March 2024 1:48 PM GMTసృజనాత్మకతకు అంతూ దరీ లేదు. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో అవ్వడంలో ప్యారిస్ హంసరాణులను మించి పోతున్నారు సౌతిండియన్ క్వీన్స్. అమెజాన్ ప్రైమ్ ఈరోజు నిర్వహించిన తాజా ఈవెంట్లో సమంత రూత్ ప్రభు స్టన్నింగ్ లుక్ తో కట్టి పడేసింది. అనుష్క శర్మ, దీపిక పదుకొనే, సోనమ్ లతో పోటీపడుతూ సామ్ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతోందనడానికి ఇది మచ్చుతునక.
తాజాగా సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ దుమ్ము లేపుతోంది. ఈ కొత్త అవతార్ కోసం కోసం సమంత టీమ్ ఎంపిక చేసిన టాప్ నిజానికి టాప్ లేపేసిందని చెప్పాలి. ఈ లుక్ లో సామ్ పక్షి రాణిని తలపించింది. ఇంకా స్పష్ఠంగా చెప్పాలంటే గరుడ పక్షి రెక్కల్లో చిక్కుకున్న అందమైన చిట్టి గువ్వలా కనిపించింది. సామ్ తాజా అవతార్ ఇప్పుడు అంతర్జాలంలో హీటెక్కిస్తోంది.
దీనికి `నమ్మశక్యం కాని కృతజ్ఞతలు` అంటూ సామ్ ప్రేమను కురపిస్తూ లవ్ ఈమోజీని షేర్ చేసింది. #సిటాడెల్ #హనీబన్నీ అంటూ అప్ కమ్ ఓటీటీ సిరీస్ ని ప్రమోట్ చేసే ట్యాగుల్ని జోడించింది. నా అద్భుతమైన దుస్తులకు ధన్యవాదాలు అంటూ క్రేషా బజాన్ బ్రాండ్ కి కృతజ్ఞతలు తెలియజేసింది. నువ్వు నన్ను అందంగా ఉండేలా చేశావు.. క్రేషాను కీర్తించింది. తనకు ఎంపిక చేసిన ఆభరణాలు & వాచ్ క్రెడిట్ బల్గరీకి చెందుతుంది. జుకాల్కర్ స్టైలింగ్ చేయగా, అవ్నీ రామ్ భయ్యా మేకప్ కోసం వర్క్ చేసారు. రోహిత్ భట్కర్ హెయిర్ స్టైలిష్ట్.
సమంత ప్రస్తుతం సిటాడెల్ భారతీయ వెర్షన్ ప్రమోషన్స్ తో బిజీ అయింది. దీనికోసం గురూజీ కరణ్ జోహార్ సారథ్యంలో భారీ ప్రమోషనల్ వేడుకకు తెర తీసింది. ఇకపై సమంత దీనిపైనే ఫోకస్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో తదుపరి ప్రాజెక్టుల గురించి ఈ ప్రమోషన్స్ లో ఓపెనవుతుందని భావిస్తున్నారు.