Begin typing your search above and press return to search.

బన్నీ తర్వాత సమంతకు ఆ ఛాన్స్‌

వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌ లో పాల్గొనేందుకు సమంతకి ఆహ్వానం అందింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:22 AM GMT
బన్నీ తర్వాత సమంతకు ఆ ఛాన్స్‌
X

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం అనారోగ్య కారణం మరియు ఇతర ఇష్యూస్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే. ఇటీవల బాలి విహార యాత్ర నుండి తిరిగి వచ్చిన సమంత సన్నిహితులతో క్వాలిటీ టైమ్ ను స్పెండ్‌ చేస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ లను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

షూటింగ్స్ కి బ్రేక్‌ తీసుకుంది కానీ ఆమె సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. అంతే కాకుండా కొన్ని కార్యక్రమాలకు కూడా సమంత హాజరు అయ్యేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం న్యూయార్క్ లో జరుగబోతున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతుంది.

వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌ లో పాల్గొనేందుకు సమంతకి ఆహ్వానం అందింది. గత ఏడాది అల్లు అర్జున్‌ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఇప్పుడు సమంత కి ఆ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఆమె ఈనెల 18 లేదా 19న న్యూయార్క్‌ వెళ్లబోతున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

ఆగస్టు 20న ఈ కార్యక్రమం జరుగనుంది. గతంలో ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ నుండి అభిషేక్ బచ్చన్‌, తమన్నా, సన్నీ డియోల్‌, రవీనా టాండన్‌, అర్జున్‌ రాంపాల్‌, రానా దగ్గుబాటి లు హాజరు అయ్యారు. గత ఏడాది అల్లు అర్జున్‌ పాల్గొనడంతో ఒక్కసారిగా ఈ కార్యక్రమం గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది.