నేను ఎప్పుడూ దాన్ని నెగెటివ్ గా చూడను : సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది బ్రేక్ తర్వాత ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 5 Jun 2024 5:30 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది బ్రేక్ తర్వాత ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల షూటింగ్స్ తో పాటు కమర్షియల్ యాడ్స్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా ఈఅమ్మడికి ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో చోటు దక్కింది.
ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ ని వెనక్కి నెట్టి మరీ సమంత ఏకంగా 13వ స్థానంలో నిలిచింది. ఈ విషయమై తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. తనకు దక్కిన గుర్తింపుతో మరింత బాధ్యత పెరుగుతుందని చెప్పుకొచ్చింది.
ఐఎండీబీ ర్యాంకింగ్ లో 13వ స్థానం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. కెరీర్ ను ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టినట్లుగా ఉంది. అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచి పోయాయి అంటే ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను అంది.
ఇండస్ట్రీలో పోటీ వల్ల మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి రంగంలో కూడా ఒకరితో ఒకరు పోల్చుకుని, ఒకరి కంటే మరొకరు ఎక్కువగా కష్టపడాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇతరుల విజయాలను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతాను.
ఇండస్ట్రీ లో ఉన్న పోటీని నేను ఎప్పుడు కూడా నెగెటివ్ గా చూడను. నాకు పోటీ అనేది మరింతగా స్ఫూర్తిని ఇస్తుంది. ఇతరులను చూసి నేర్చుకుంటాను తప్ప నెగెటివ్ గా ఆలోచించి కెరీర్ లో నష్టపోను అంటూ సమంత చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. మరో వైపు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది ఖుషి చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సమంత మరిన్ని సినిమాలతో ముందు ముందు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.