Begin typing your search above and press return to search.

సమంత మరో రెండు కూడానా ?

ఐతే ఎంత వెనక్కి వెళ్తుందో అంతే ఫోర్స్ గా దూసుకొస్తుంది సమంత.

By:  Tupaki Desk   |   3 Aug 2024 3:48 AM GMT
సమంత మరో రెండు కూడానా ?
X

15 ఏళ్ల క్రితం హీరో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే టైం లో కూడా సౌత్ స్టార్ గా ఒక రేంజ్ కి వెళ్తుందని ఊహించి ఉండదు స్టార్ హీరోయిన్ సమంత. కెరీర్ మొదలు పెట్టి 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తన గ్లామర్ తో యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది సమంత. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే ఒక హీరోని ప్రేమించి పెళ్లాడి.. 3 ఏళ్లలోనే డైవర్స్ తీసుకున్న సమంత ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి వల్ల సినిమాలకు దూరమైంది. ఐతే ఎంత వెనక్కి వెళ్తుందో అంతే ఫోర్స్ గా దూసుకొస్తుంది సమంత.

ఇప్పుడు అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని మళ్లీ వెండితెర మీద సత్తా చాటాలని చూస్తుంది. సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ హన్నీ బన్నీ సీరీస్ లో నటించింది. వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అమ్మడు సీరీస్ లో హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే సమంత సొంత బ్యానర్ పెట్టి మా ఇంటి బంగారం అనే సినిమా మొదలు పెట్టింది. ఆ సినిమా షూటింగ్ సీక్రెట్ గా జరుగుతుందని టాక్.

ఐతే సమంత ఏదో సరదాగా కాదు సీరియస్ గానే ప్రొడ్యూసర్ గా కొనసాగాలని అనుకుంటుంది. మొదటి ప్రాజెక్ట్ గా బంగారం చేస్తున్న అమ్మడు అది పూర్తి కాకుండానే మరో రెండు సీరీస్ లను నిర్మించేలా ప్లాన్ చేస్తుందట. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లతో కలిసి సమంత రెండు వెబ్ సీరీస్ లను నిర్మిస్తుందని టాక్. ఆ వెబ్ సీరీస్ లకు సమంత సహ నిర్మాతగా ఉండాలని చూస్తుంది.

తనకు ఇంత ప్రేమ అందించిన సినీ పరిశ్రమకు రిటర్న్ గిఫ్ట్ గా ఇందులో సంపాదించిన మొత్తాన్ని ఇందులోనే ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యింది సమంత. ఐతే సౌత్ హీరోయిన్స్ ప్రొడ్యూసర్ గా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. బాలీవుడ్ లో అయితే హీరోయిన్స్ నటిస్తూనే నిర్మాతగా మారి మంచి సినిమాలు చేస్తుంటారు. వారి బాటలోనే సమంత ఏదో పార్ట్ టైం ప్రొడ్యూసర్ గా కాకుండా ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా కొనసాగించాలని చూస్తుంది. సమంత కొత్త టర్న్ కచ్చితంగా ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని చెప్పొచ్చు.