Begin typing your search above and press return to search.

సమంత ఈ మౌనానికి కారణమేంటి?

మరల యాక్టింగ్ కి రెడీ అయిన కూడా టాలీవుడ్ నుంచి సమంతని ఎవరూ సంప్రదించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 July 2024 4:37 AM GMT
సమంత ఈ మౌనానికి కారణమేంటి?
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ మూవీ తర్వాత ఇప్పటి వరకు మరల స్క్రీన్ మీద కనిపించలేదు. ఏడాది పాటు ఆమె యాక్టింగ్ కి దూరంగా ఉంది. ఫిట్ నెస్ సమస్యలని అధికమించే ప్రయత్నం ఈ ఏడాదిలో చేసింది. మరల యాక్టింగ్ కి రెడీ అయిన కూడా టాలీవుడ్ నుంచి సమంతని ఎవరూ సంప్రదించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అమ్మడు ముంబైకి మకాం మార్చేసింది.

హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం సీరియస్ గా ట్రై చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. హిందీలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇది సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో సమంతకి మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో నెక్స్ట్ వారితో సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోదనే టాక్ వినిపిస్తోంది.

ఈ సిరీస్ కి రాజ్ అండ్ డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ని లాంచ్ చేశారు. అయితే క్యాస్టింగ్ ఎవరనేది ఎనౌన్స్ చేయలేదు. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామిక గబ్బి కీలక పాత్రలలో నటిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఈ సిరీస్ లో సమంత మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రని చేయబోతోందని ప్రచారం బలంగా జరుగుతోంది.

అయితే చిత్ర యూనిట్ మాత్రం సమంత పేరుని ఇంకా ఎనౌన్స్ చేయలేదు. అందుకే ఈ సిరీస్ విషయంలో ఆమె కూడా సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతల నుంచి అఫీషియల్ గా ప్రకటన వస్తేనే బాగుంటుందని ఆమె వెయిట్ చేస్తుందంట. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాని సమంత తన సొంతం ప్రొడక్షన్ ట్రాలాలలో ప్రకటించింది. ఈ సినిమాపైనే కూడా సమంత సైలెంట్ గానే ఉంది.

సమంత ఫ్యాన్స్ మాత్రం తనప్ పేవరేట్ హీరోయిన్ ని ఆన్ స్క్రీన్ పై చూడాలని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. సమంత మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయంలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఆమె ఫ్యాషన్ లైఫ్ కు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తుంది. బాలీవుడ్ లో అమ్మడు త్వరలో ఒక బిగ్ ప్రాజెక్టుతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. మరి ఆ సినిమాపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.