Begin typing your search above and press return to search.

సిటాడెల్.. చాలా ఇబ్బంది పడ్డ సమంత

త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సందడి చేయనుంది.

By:  Tupaki Desk   |   24 March 2024 12:54 PM GMT
సిటాడెల్.. చాలా ఇబ్బంది పడ్డ సమంత
X

టాలీవుడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు.. ప్రస్తుతం మూవీలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా తర్వాత.. మయోసైటిస్ కారణంగా విదేశాల్లో ఫుల్ రెస్ట్ తీసుకుంది సామ్. ఇప్పుడు ఇండియా తిరిగొచ్చేసి.. తన వర్క్ స్టార్ట్ చేసింది. వరుస చిత్రాలకు సిద్ధమైనట్లు ఇటీవల చెప్పింది. త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సందడి చేయనుంది.

కొద్ది రోజుల నుంచి పాడ్ కాస్ట్ ద్వారా హెల్త్ కు సంబంధించిన విషయాలు పంచుకుంటోంది హీరోయిన్ సమంత. పలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెబుతోంది. మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ పేరుతో ఈ విషయాలను యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తోంది. తాజా పాడ్ కాస్ట్ ఎపిసోడ్ లో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ అల్కోశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఆ సమయంలో మయోసైటిస్ గురించి మాట్లాడింది.

అయితే ఖుషి మూవీ తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ చేయడానికి తాను ఒప్పుకున్నట్లు సమంత చెప్పింది. షూటింగ్ సమయంలో తాను ఎంతో బాధపడినట్లు తెలిపింది. చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిసినా ఒప్పుకున్నట్లు పేర్కొంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని చెప్పింది. షూట్ మధ్యలో తన టీమ్ న్యూట్రీషనిస్ట్ కు కాల్ చేసిందని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది.

ఓసారి సిటాడెల్ సెట్స్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యానని, మొత్తం టీమ్ అంతా అప్సెట్ అయిందని చెప్పింది సమంత. ఇప్పుడు సిటాడెల్ సిరీస్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ పోస్ట్ చేసిన వీడియోలో అల్ట్రా స్టైలిష్ స్పై గా సమంత అదరగొట్టింది. మెయిన్ గా యాక్షన్ సీన్స్ లో గన్ పట్టుకొని పోరాడే షాట్స్ లో సామ్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు.

కొన్ని సీన్లలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను మించి సామ్.. ఎంతో అందంగా కనిపించిందని అంటున్నారు. సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రియాంక నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సమంత ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సమంతతోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు. మరి ఈ సిరీస్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.