సమంతకు ఏమైంది.. ఖుషి విషయంలో ఎందుకలా?
స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది
By: Tupaki Desk | 11 Aug 2023 8:24 AM GMTస్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరో సారి ఆమె గురించి నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. అందుకు కారణం ఆమె 'ఖుషి' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ఎగొట్టడంతో పాటు దానికి సంబంధించి ఏమీ మాట్లాడకపోవడం.
వాస్తవానికి సమంత ఈ ఈవెంట్ కు డుమ్మా కొట్టడాన్ని కూడా రిసీవ్ చేసుకున్నారంతా. కానీ కనీసం ఒక వీడియో బైట్ అయినా పంపించి ఉండే బాగుండేది కదా అని అభిప్రాయపడుతున్నారు. అసలు ఆమె ఎందుకలా చేయలేదు, సోషల్ మీడియాలో ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునే ఆమె, ఈ సినిమా గురించి ట్రైలర్ గురించి ఓ చిన్న పోస్ట్ తో సరిపెట్టేసింది. ఇతర వివరాలు ఏమీ మాట్లాడలేదు.
పైగా సినిమాలకు బ్రేక్ అంటూ చాలా రోజులుగా తన ఫ్రెండ్ తో కలిసి ఫారెన్ టూర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ముందే చెన్నై కూడా చేరుకుంది. కానీ హైదరాబాద్ మాత్రం రాలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త హర్ట్ అయ్యారు. విజయ్ మాత్రం.. ఆ ఈవెంట్ లో సమంతను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశారు. కానీ సామ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ సమంతకు ఏమై ఉంటుందా? అని తెగ మాట్లాడేసుకుంటున్నారు.
సమంతకు 'ఖుషి' టీమ్ తో ఏమైనా మనస్ఫర్థలు వచ్చాయా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ మధ్యలో కూడా ఓ సారి ఖుషి టీమ్-సమంతకు మధ్య మనస్ఫర్థలు వచ్చినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు సంబంధించిన ఆమె ఏమీ మాట్లాడపోయేసరికి ఈ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా రిలీజ్ దగ్గరపడడంతో సమంత ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి సమంత ఏం చేస్తుందో..
ఇక ఖుషి సినిమా విషయానికొస్తే.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. సామ్ హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా పర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 1న సినిమా గ్రాంజ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను రూపొందించారు.