Begin typing your search above and press return to search.

గోల్డెన్ డ్రెస్ లో సామ్ గ్లామర్ హీట్

తాజాగా గోల్డెన్ డ్రెస్ లో గోల్డెన్ గర్ల్ లా మెరిసిపోయారు. డ్రెస్ లో సామ్ చాలా స్టైలిష్ గా కనపడుతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 8:20 AM GMT
గోల్డెన్ డ్రెస్ లో సామ్ గ్లామర్ హీట్
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. దశాబ్దానికి పైగా ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నిజానికి హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. వరసగా నాలుగైదు సంవత్సరాలపాటు సినిమాలు చేస్తే, తర్వాత వారిని హీరోయిన్లుగా ఎంచుకున్నారు, ఒకవేళ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చినా, అది ఏ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానో అయ్యి ఉంటుంది. కానీ, సమంత ఓ వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, మరో వైపు క్యూట్ లవ్ స్టోరీల్లోనూ ఆకట్టుకుంటోంది.



సమంత హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ఖుషీ.ఈ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఆమె విజయ్ దేవర కొండ సరసన నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంత పూర్తి చేశారు. ఇక, మూవీ థియేటర్స్ లోకి అడుగుపెట్టడమే తరువాయి. కాగా, ప్రస్తుతం సమంత న్యూయార్క్ లో ఉన్నారు.

అక్కడ కూడా మూవీ ప్రమోషన్స్ చేశారు. ఇక , న్యూయార్క్ వెళ్లిన తర్వాత కూడా కొత్త కొత్త ఫోజులతో ఫోటో షూట్స్ చేసి అదరగొగుతున్నారు. తాజాగా గోల్డెన్ డ్రెస్ లో గోల్డెన్ గర్ల్ లా మెరిసిపోయారు. డ్రెస్ లో సామ్ చాలా స్టైలిష్ గా కనపడుతోంది. మేకప్ కూడా, ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా గోల్డెన్ మేకప్ వేసుకోవడం విశేషం. చాలా అందంగా కనపడుతున్నారు.

న్యూయార్క్ వీధుల్లో బ్లూ కలర్ డ్రెస్ లో మరో ఫోటోలో కనిపించారు.ఫ్లోరల్ బ్లూ కలర్ డ్రెస్ లో దానికి సెట్ అయ్యేలా ముత్యాల సెట్ ధరించారు. కళ్లకు గాగుల్స్ పెట్టి సూపర్ స్టైలిష్ గా కనపడుతున్నారు.ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా, సమంత చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లారు. చికిత్స కోసం వెళ్లినా, మూవీ కోసం మాత్రం చాలా ఎక్కువగానే కష్టపడుతోంది.

ఇక, ఈ ఖుషీ మూవీ విషయానికి వస్తే, ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. రెండు విభిన్న మతాల వారు ప్రేమించుకొని, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంది? సంతోషంగా ఉన్నారా? లేక గొడవలతో విడిపోయారా అనేదే ఈ కథ. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.