Begin typing your search above and press return to search.

సమంత రెడ్ లైట్ థెరపీ.. ఇది సంగతి!

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత చేసింది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 12:23 PM GMT
సమంత రెడ్ లైట్ థెరపీ.. ఇది సంగతి!
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. ది ఫ్యామిలీ మెన్ 2తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సమంత సక్సెస్ అందుకుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో చేసిన సెకండ్ వెబ్ సిరీస్ సిటాడెల్ నవంబర్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రీసెంట్ గా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది. వరుణ్ ధావన్ తో ఈ వెబ్ సిరీస్ లో సమంత జత కట్టింది.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత చేసింది. మరో వైపు మా ఇంటి బంగారం అనే మూవీని తన సొంత ప్రొడక్షన్ లో ఎనౌన్స్ చేసింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే సమంత రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో హెల్త్ బెన్ ఫిట్స్ గురించి పాడ్ కాస్ట్ స్టోరీస్ ని షేర్ చేసుకుంటుంది.

అలాగే తాను డైలీ ఫాలో అయ్యే ఆరోగ్య సంరక్షణ గురించి అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. డైలీ మార్నింగ్ రొటీన్ స్టోరీస్ లో సమంత వీటిని షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో తాజాగా రెడ్ లైట్ థెరపీ తీసుకుంటున్నట్లు ఇమేజ్ షేర్ చేసింది. ఈ రెడ్ లైట్ థెరపీ అనేది చర్మ సౌందర్యం కోసం చేయించుకుంటారు. అలాగే వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని కూడా ఈ రెడ్ లైట్ థెరపీ తగ్గిస్తుందంట.

మాయోసైటిస్ బారిన పడిన తర్వాత ఏడాది పాటు సమంత దానికి ట్రీట్మెంట్ తీసుకుంది. కండరాల బలహీనతతో వచ్చే అరుదైన వ్యాధి మాయోసైటిస్. ఈ మాయోసైటిస్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడి చర్మ సౌందర్యం పెంచుకోవడానికి సమంత ఈ రెడ్ లైట్ థెరపీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆహారపు అలవాట్లు గురించి కూడా సమంత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది.

ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం సమంత ఎంతగా కేర్ తీసుకుంటుందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సమంత మరో వీడియో టీజర్ ని షేర్ చేసింది. టేక్ 20 పాడ్ కాస్ట్ స్టోరీలో ఆ వీడియో రాబోతోందని తెలిపింది. ఇందులో బ్లడ్ షుగర్ ఇన్ బ్యాలెన్స్ వలన పిల్లలలో తలెత్తే సమస్యల గురించి డాక్టర్ తో సమంత డిస్కస్ చేస్తోంది. తన వీడియోల ద్వారా మంచి మంచి హెల్త్ అవేర్ నెస్ యాక్టివిటీస్ ని సమంత చేస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.