Begin typing your search above and press return to search.

సామ్ పాఠం: జ‌నాల‌కు మంచి చెబితే విన‌రు

అందుకే గొప్ప సామాజిక సందేశంతో సినిమా తెర‌కెక్కించినా కానీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేక‌పోతే జ‌నం సినిమా చూడ‌నే చూడ‌రు.

By:  Tupaki Desk   |   7 March 2024 4:47 AM GMT
సామ్ పాఠం: జ‌నాల‌కు మంచి చెబితే విన‌రు
X

సినిమాలు తీసి సందేశం ఇస్తాం అంటే జ‌నం థియేట‌ర్ల‌కు రారు. కిక్కిచ్చే విజువ‌ల్స్ తో క‌ట్టి ప‌డేస్తేనే ఫ‌లితం పాజిటివ్ గా వ‌స్తుంది. అందుకే గొప్ప సామాజిక సందేశంతో సినిమా తెర‌కెక్కించినా కానీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేక‌పోతే జ‌నం సినిమా చూడ‌నే చూడ‌రు. ఇప్పుడు ఇదే ఫార్ములా స‌మంత పాడ్ కాస్ట్ కి అన్వ‌యించాల్సి ఉంటుంది.

స‌మంత ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో హెల్త్ పాడ్‌కాస్ట్ ల‌తో అంద‌రినీ అలెర్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత త‌న‌కు వ‌చ్చిన‌ మైయోసైటిస్ గురించి ఈ వేదిక‌పై చాలా మంచి విషయాలను షేర్ చేస్తోంది . ఆటో ఇమ్యూన్ కండిషన్ ట్రాప్‌లో పడకుండా ప్రజలు ఆచరించాల్సిన మార్గాల గురించి చెబుతోంది. ఇప్ప‌టికే మొద‌టి ఎపిసోడ్ ని విడుదల చేయ‌గా రెండు వారాల్లో 145K వీక్షణలు వచ్చాయి. రెండవ ఎపిసోడ్‌కు 6 రోజుల్లో 43K వీక్షణలు మాత్రమే వచ్చాయి.

అయితే అదే స‌మ‌యంలో స‌మంత స్పెష‌ల్ నంబ‌ర్'ఊ అంటావా..` తెర వెనుక వీడియోని యూట్యూబ్‌లో ట్రిమ్ వీడియోగా షేర్ చేయగా.. అది కేవలం 3 రోజుల్లోనే 2 కోట్ల (20 మిలియన్ల)కు పైగా వ్యూస్ సాధించింది. ఊ అంటావా కు ఉన్న గిరాకీ ఆరోగ్య సూత్రాల‌కు లేద‌ని ప్రూవ్ అయింది. చివ‌రికి పాడ్ కాస్ట్ కూడా మాస్‌కి ఎక్కితేనే బ్లాక్ బ‌స్ట‌ర్.. లేదంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు!! అని మ‌రోసారి ప్రూవ్ అయింది.

సమంత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విజయ్ దేవరకొండతో తన రెండవ తెలుగు చిత్రం'ఖుషి`లో కనిపించింది. మహానటి తర్వాత ఈ జంట క‌ల‌యిక‌లో రెండో చిత్ర‌మిది. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైంది. త‌దుప‌రి రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్ష‌న్ లో క‌నిపించ‌నుంది. సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనేందుకు స‌మంత రెడీ అవుతోంద‌ని స‌మాచారం. బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.