పడిలేచిన కెరటంలా సమంత పైపైకి అలా!
విడాకులకు తానే కారణం అన్నట్లు సోషల్ మీడియాలో విమర్శలు..ట్రోలింగ్ లు..కామెంట్లు ఇలా ఒకటేంటి చైతో సపరేట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కుంది.
By: Tupaki Desk | 10 Nov 2023 12:30 AM GMTనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎలాంటి ఫేజ్ లోకి వెళ్లిందో తెలిసిందే. వృత్తిపరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికి సామ్ వ్యక్తిగతంగా చాలా సవాళ్లు ఎదుర్కుంది. విడాకులకు తానే కారణం అన్నట్లు సోషల్ మీడియాలో విమర్శలు..ట్రోలింగ్ లు..కామెంట్లు ఇలా ఒకటేంటి చైతో సపరేట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కుంది. వాటి నుంచి నెమ్మదిగా కోలకుంటోంది అనుకుంటోన్న సమయంలోనే మయోసై టిస్ అనే అరుదైన వ్యాధి బారిపడిన పడింది.
ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడింది. రెండేళ్ల కాలంలోనే ఇన్ని రకాల విపత్కర పరస్థితులు ఎదుర్కో వాల్సి వచ్చింది. సమంత కెరీర్ లోనే అదో బ్యాడ్ పేజ్. ఈ సమస్యల్ని అధిగమించడానికి వ్యక్తిగతంగా తాను తీసుకోవాల్సిన ప్రతి చర్యలన్నింటిని తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి పరిస్థితుల నుంచి ఎలా బటయ పడగలిగారు? అనే ఆసక్తికర ప్రశ్న సమంత ముందుకెళ్లుంది. దానికి ఆమె అంతే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
`నేను ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి చేరుకున్నప్పుడు పెద్దగా బాధపడింది లేదు. కానీ రెండు సంవత్సరాలుగా నేను భరించిన పెయిన్ తో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. చిన్న చిన్న విషయాలకే ఎందు కలా కృంగిపోతారో నాకు అప్పుడే అర్ధమైంది. ఆ సమయంలో నేను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న నటుల గురించి చదివాను. వారి వ్యక్తిగత జీవితంపై వచ్చిన విమర్శలు..ఎదుర్కున్న సవాళ్లు ఎలాంటి వన్నీ చాలా అధ్యయనం చేసాను.
వాళ్లు ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డారో తెలుసుకున్నాను. వారి స్పూర్తి దాయకమైన జీవితమే నాకు ఆదర్శంగా కనిపించింది. నాలో ఆత్మ విశ్వాసాన్ని..సంకాల్పాన్ని మరింత దృడంగా చేసాయి. మన దేశంలో ప్రియమైన స్టార్‌గా ఉండటం అనేది అద్భుతమైన బహుమతి. ఆదేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. ఆ విషయంలో నేను అంతే బాధ్యతగా..నిజాయితీగా వ్యవహరించాలి.
సూపర్ హిట్ లు.. సూపర్ హిట్‌లు.. బ్లాక్‌బస్టర్లు.. అవార్డులు.. పరిపూర్ణ శరీరాకృతి..స్టైలిష్ దుస్తులను కలిగి ఉండటం ముఖ్యం కాదు. నాకో గొప్ప స్థానం ఉన్నప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఇందులో ఎంత పెయిన ఉన్నా తట్టుకుని నిలబడాలి. నేను స్పూర్తి పొందిన వారిలో ఈ లక్షణాల్ని ఉన్నాయి. జీవితంలో వ్యక్తిగతంగా ఎలాంటి ససమస్య ఎదురైనా దానిపై పోరాటం చేసి నెగ్గే అంత బలంగా మారాలి అని ఆశిస్తున్నాను` అంది. మొత్తానికి సామ్ స్పీచ్ చాలా స్పూర్తిదాయకంగానూ ఉంది.