Begin typing your search above and press return to search.

సామ్ ఏంటి ఇలా మారిపోయింది? ఏం జరుగుతోంది?

ఇటీవల ముంబైలో జరిగిన అనామికా ఖన్నా X H&M కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌ లో బ్లాక్ కలర్ డ్రెస్ లో సమంత తళుక్కుమంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 9:49 AM GMT
సామ్ ఏంటి ఇలా మారిపోయింది? ఏం జరుగుతోంది?
X

స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య వార్తల్లో బాగా నిలుస్తోంది. మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమెను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే అమ్మడు ఎప్పుడో పూర్తి చేసిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. తన బ్యానర్ పై ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరిన్ని ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేసుకుంటోంది. హెల్త్ కు సంబంధించిన పలు విషయాలు పోస్ట్ చేస్తుంటుంది. అదే సమయంలో ఈ మధ్య ఓ స్పెషల్ అప్డేట్ అని చెప్పి.. పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అప్పుడు సామ్.. డెనిమ్ జీన్స్, బ్లాక్ కలర్ పోలో టీ షర్ట్ లో కాస్త ఫిట్ గా కనిపించింది. కానీ ఆమె బాగా సన్నబడిందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

ఇటీవల ముంబైలో జరిగిన అనామికా ఖన్నా X H&M కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌ లో బ్లాక్ కలర్ డ్రెస్ లో సమంత తళుక్కుమంది. ఫాబ్రిక్ పెయింట్ డిజైన్ డ్రెస్ అదిరిపోయినా.. సామ్ పిక్స్ చూసి మాత్రం షాకయ్యామని ఫ్యాన్స్ చెబుతున్నారు. పూర్తిగా ఆమె మారిపోయినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అదేంటి ఎందుకు అలా అయిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కసారిగా బాగా వెయిట్ తగ్గడం చూస్తుంటే షాకింగ్ గా ఉందని అంటున్నారు.

సామ్ ఫేస్ లో అప్పటి గ్లో కనిపించడం లేదని చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. పర్సనల్ రీజన్ వల్ల సన్నబడిందా, లేక మయోసైటిస్ చికిత్సలో భాగంగా స్లిమ్ అయిందా అని అనుమానపడుతున్నారు. మరికొందరు సన్నబడినా.. హెల్దీగా ఉంటే చాలని చెబుతున్నారు. ఏదేమైనా సామ్ కొత్త లుక్ చూసి మాత్రం ఒక్కసారిగా అంతా షాకైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత కొత్త పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సామ్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో స్టార్ట్ కానున్నాయి. తన బర్త్ డే రోజు అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం మూవీలో లీడ్ రోల్ లో నటిస్తూనే ప్రొడ్యూస్ చేయనుంది సమంత. మరి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆమె ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.