సమంత సైలెన్స్ వెనుక రీజన్ అదేనా..?
కెరీర్ లో టాప్ ప్లేస్ కి వెళ్లిన సమంత చైతన్యతో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ కాస్త డిస్టర్బింగ్ గా అనిపించినా మళ్లీ అమ్మడు కెరీర్ సెట్ రైట్ చేసుకుంటూ వచ్చింది.
By: Tupaki Desk | 16 Jun 2024 12:28 PM GMTసౌత్ స్టార్ హీరోయిన్ గా సమంత అంటే తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ సినిమా నుంచి తన ప్రతి ప్రాజెక్ట్ తో అలరిస్తూ వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇచ్చిన క్యారెక్టర్ లో సమంత ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కెరీర్ లో టాప్ ప్లేస్ కి వెళ్లిన సమంత చైతన్యతో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ కాస్త డిస్టర్బింగ్ గా అనిపించినా మళ్లీ అమ్మడు కెరీర్ సెట్ రైట్ చేసుకుంటూ వచ్చింది.
మధ్యలో ఆమెకు మయోసైటిస్ వ్యాధి వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. ఐతే ఇప్పుడు పర్సనల్ గా అన్ని ఇబ్బందులను దాటుకుని వచ్చిన సమంత తిరిగి సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. బాలీవుడ్ లో వెబ్ సీరీస్ చేసిన సమంత తెలుగు తమిళ భాషల్లో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తన సొంత ప్రొడక్షన్ లో చేయడం చూస్తుంటే సమంత ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.
వెనక్కి వెళ్లిన ప్రతిసారి రెండింతల వేగంతో దూసుకొస్తున్న సమంత ఈసారి కూడా కంబ్యాక్ ఒక రేంజ్ లో ఉండాలని అనుకుంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ఇప్పటికిప్పుడు అవకాశాలు తనను వెతుక్కుంటూ రాకపోయినా మళ్లీ తన సినిమాలతో సత్తా చాటాలని చూస్తుంది సమంత.
మా ఇంటి బంగారం సినిమాలో సమంత క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సమంత నిర్మాతగా కూడా చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ ఏర్పడింది. మరి సమంత అనుకున్న విధంగా తిరిగి ఫాంలోకి వస్తుందా తెలుగులో మళ్లీ వరుస స్టార్ సినిమాలు అందుకుంటుందా అన్నది చూడాలి. సమంత ఓకే అంటే చాలు కానీ ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఐతే ఇకమీదట ఐటెం సాంగ్స్ మాత్రం చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యిందట సమంత. పుష్ప సినిమాలో ఉ అంటావా సాంగ్ తనకు మంచి క్రేజ్ తెచ్చినా ఆ సాంగ్ లో నటించడం మాత్రం సరైన నిర్ణయం కాదని ఈమధ్య అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అందుకే ఇక మీదట కథాబలం ఉన్న పాత్రలు.. సినిమాలనే చేసేందుకు సిద్ధం అవుతుంది సమంత.