Begin typing your search above and press return to search.

సమంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందా..!

బంగారం సినిమా పోస్టర్ లో తుపాకితో కనిపించిన సమంత ఇదో ఫన్ రైడ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 12:30 PM GMT
సమంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందా..!
X

యాక్టింగ్ లోనే కాదు గ్లామర్ విషయంలో కూడా ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్న సమంత ఇప్పటికీ కాన్ స్టంట్ ఫ్యాన్ బేస్ తో కొనసాగుతుందని చెప్పొచ్చు. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన అన్ని విషయాలు ఆమెను ఎంత వెనక్కి నెట్టినా మళ్లీ రెండింతల ఉత్సాహంతో సమంత తిరిగి వస్తుంది. రెండేళ్లుగా మయోసైటిస్ తో బాధపడ్డ సమంత ఖుషి తర్వాత నెక్స్ట్ సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంది. బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటించిన అమ్మడు లేటెస్ట్ గా తన ఓన్ ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది.

బంగారం సినిమా పోస్టర్ లో తుపాకితో కనిపించిన సమంత ఇదో ఫన్ రైడ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే సమంత ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టు చెప్పుకుంటున్నారు. కథ కథనం మాత్రమే కాదు సినిమాలో మిగతా విషయాల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సమంత చూసుకుంటుందని టాక్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు కానీ సినిమాను ప్రతిభ గల దర్శకుడి చేతిలోనే పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో సమంత పాత్ర కూడా చాలెంజింగ్ గా ఉంటుందని. సినిమాతో మరోసారి నటిగా సమంత తనను తాను ప్రూవ్ చేసుకుంటుందని అంటున్నారు. ఎలాంటి పాత్రలో అయినా సరే సమంత ఇట్టే ఆకట్టుకుంటుంది. ఐతే తన నిర్మాతగా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఆమె ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. సమంత ప్రొడక్షన్ కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే సంకల్పంతో పెట్టినట్టు తెలుస్తుంది.

మా ఇంటి బంగారం తో సమంత మరోసారి తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. సమంత సొంత బ్యానర్ కాబట్టి సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తుంది. బాలీవుడ్ లో హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ గా రాణిస్తుండగా సౌత్ ఇండస్ట్రీలో అదే మన తెలుగులో అలాంటి ప్రయత్నాలు చాలా తక్కువ అని చెప్పాలి. కానీ సమంత మాత్రం హీరోయిన్ గానే కాదు నిర్మాతగా కూడా సూపర్ హిట్ అనిపించుకోవాలని చూస్తుంది. మరి సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. ప్రయోగాలతో పాటుగా తనకు వచ్చిన కమర్షియల్ సినిమాలకు కూడా ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్న సమంత ఇక మీదట కెరీర్ లో మరింత దూకుడు చూపించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.