Begin typing your search above and press return to search.

సినిమాను బతికించడం కోసం ఆ విషయం చెప్పా..!

యశోద సినిమా షూటింగ్ సమయంలో నాకు మయో సైటిస్ అనారోగ్య సమస్య గురించి తెలిసింది. షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాను.

By:  Tupaki Desk   |   16 March 2024 3:46 AM GMT
సినిమాను బతికించడం కోసం ఆ విషయం చెప్పా..!
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత మయో సైటిస్ కారణంగా ఏడాది కాలంగా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. తిరిగి సమంత సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సమంత టీవీ షో ల్లో కనిపిస్తూ, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ, టాక్‌ షో ల్లో గెస్ట్‌ గా సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ... తన అనారోగ్య సమస్యల గురించి మొదట బయటకు చెప్పొద్దు అనుకున్నాను. మయో సైటిస్ సమస్య గురించి అసలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకున్నాను. కానీ యశోద సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.. ఆ సమయంలో మయో సైటిస్ గురించి చెప్పాల్సి వచ్చింది.

యశోద సినిమా షూటింగ్ సమయంలో నాకు మయో సైటిస్ అనారోగ్య సమస్య గురించి తెలిసింది. షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాను. ఆ సమయంలో యశోద సినిమా నిర్మాత వచ్చి ప్రమోషన్ చేయక పోతే తీవ్రంగా నష్టపోతాను, సినిమా ఆడకుంటే చచ్చిపోయే పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సమయంలో యశోద సినిమా ను బతికించడం కోసం మీడియా ముందుకు వచ్చాను. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మయో సైటిస్ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందని సమంత తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం వల్ల నేను నా సక్సెస్‌ ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేక పోతున్నట్లుగా కూడా సమంత ఆవేదన వ్యక్తం చేసింది.

గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్న సమంత హిందీలో చేసిన సిటాడెల్ వెబ్‌ సిరీస్ తో ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆమె హీరోయిన్ గా నటించబోతున్న సినిమాల్లో ఏమైనా ఈ ఏడాదిలో విడుదల అయ్యేనా చూడాలి.