Begin typing your search above and press return to search.

సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఎవరి కోసం?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. త్వరలోనే 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 May 2024 10:30 AM GMT
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఎవరి కోసం?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. త్వరలోనే 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ లో సామ్ లీడ్ రోల్ పోషించింది. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ సహా ఇతర విద్యలు కూడా నేర్చుకుంది. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ ఇది.

ఇక రీసెంట్ గా ఆమె బర్త్ డే సందర్భంగా 'మా ఇంటి బంగారం' అనే కొత్త మూవీ అనౌన్స్ చేసింది సమంత. పోస్టర్ కూడా విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే సామ్.. గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. అప్పుడప్పుడు హెల్త్ కు సంబంధించిన పోస్టులు కూడా పెడుతూ మోటివేట్ చేస్తోంది.

సమంత లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నానంటూ పోస్ట్ చేసింది. నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో, నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో, నేను నీ కోసం ప్రార్థిస్తున్నా, మీరు విజయానికి అర్హులు అంటూ రాసుకొచ్చింది. దీంతో సామ్.. ఐపీఎల్ ను ఉద్దేశించే పోస్ట్ పెట్టిందని చాలా మంది భావిస్తున్నారు. ఆర్సీబీ టీమ్‌ కు సమంత సపోర్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అద్భుతం చేసిందనే చెప్పాలి. లీగ్ దశలోనే ఇంటి బాట పడుతుందనుకున్న టీమ్.. ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. దానికి ముఖ్య కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అన్ని మ్యాచుల్లో అద్భుతంగా ఆడారు. ఇప్పటికే అనేక సార్లు.. సమంత విరాట్ కోహ్లీపై ప్రశంసలు కూడా కురిపించిన విషయం తెలిసిందే. ఇక నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.

అందుకే ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ.. సమంత మ్యాచ్ కు ముందు పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె పోస్ట్ కు క్రికెట్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఏదో పర్సనల్ పోస్ట్ లాగానే అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు సమంత పోస్ట్ కోసమే చర్చ నడుస్తోంది. మరి దీనిపై సమంత క్లారిటీ ఇస్తే గానీ చర్చలు ఆగవు. వేచి చూడాలి సామ్ ఏమైనా స్పందిస్తుందేమో.