Begin typing your search above and press return to search.

రూ.500 నుండి రూ.4 కోట్లకు !

ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీ నటి సమంతా. మయోసైటిస్ కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   26 May 2024 11:30 AM GMT
రూ.500 నుండి రూ.4 కోట్లకు !
X

ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగోలేక 11వ తరగతిలో ఉన్నప్పుడు ఓ హోటల్లో ఈవెంట్ కు హోస్ట్ గా పనిచేసింది. అప్పుడు ఎనిమిది గంటలు పనిచేస్తే రూ.500 పారితోషికం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీ నటి సమంతా. మయోసైటిస్ కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతోనే నిర్మాతగాను పరిచయమవుతుంది.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన సమంతా ఉన్నత చదువులు జీవితంలో స్థిరపడాలని అనుకుంది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేసింది. కుటుంబానికి అండగా నిలబడేందుకు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. చెన్నైలోని పలు షాపింగ్ మాల్స్ ప్రకటనలలో నటించిన సమంతా అదే క్రమంలో చిత్రనిర్మాత రవి వర్మన్ కంట్లో పడి సినిమా ఛాన్స్ కొట్టేసినా అది మధ్యలోనే ఆగింది.

2010లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన సమంతా ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ కావడంతో ఆమె ఏకంగా వందల కోట్లకు అధిపతిగా ఎదిగిపోయింది. గాడ్ ఫాదర్ లేకున్నా సినీ పరిశ్రమలో ఎదిగిన సమంతా జీవితం ఎందరికో ఆదర్శం.