Begin typing your search above and press return to search.

సమంత కొత్త వీడియో వైరల్‌

సూర్యాస్తమయ సమయంలో అందమైన వాతావరణంలో గుర్రం పై సమంత స్వారీ చేస్తూ ఉన్న వీడియో నెట్టింట తెగ సందడి చేస్తూ వైరల్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:46 AM GMT
సమంత కొత్త వీడియో వైరల్‌
X

సమంత షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన గుర్రపు స్వారీ వీడియో ను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన సమంత గుర్రపు స్వారీ తో అదరగొట్టింది.

సూర్యాస్తమయ సమయంలో అందమైన వాతావరణంలో గుర్రం పై సమంత స్వారీ చేస్తూ ఉన్న వీడియో నెట్టింట తెగ సందడి చేస్తూ వైరల్‌ అవుతోంది. సమంత ఉన్నట్టుండి ఎందుకు గుర్రపు స్వారీ చేస్తుంది, ఎందుకు ప్రాక్టీస్ చేస్తుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతానికి సమంత గుర్రపు స్వారీ కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ కచ్చితంగా సమంత భవిష్యత్తులో చేయబోతున్న లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని ఆమె అభిమానులు చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు.

ఖుషి సినిమా తర్వాత తెలుగు లో సమంత నటించిన సినిమాలు ఏమీ రాలేదు. అయితే ఆమె బ్రేక్‌ ముగిసిన వెంటనే చేయబోతున్న తెలుగు సినిమా అయ్యి ఉండదని, హిందీ సినిమా లేదా వెబ్‌ సిరీస్ అయ్యి ఉంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేసే సమంత ఈసారి గుర్రపు స్వారీ చేయడం ద్వారా ఏదో మెసేజ్ ఇస్తుంది అన్నట్లుగా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత కొత్త వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది.