ఫోటో స్టోరి: బాలిలో సమంత 4 డిగ్రీల ఐస్ బాత్
కొంతకాలంగా సమంత తనకు అత్యంత ఇష్టమైన పెట్స్ తో ప్రయాణాలు చేస్తోంది
By: Tupaki Desk | 27 July 2023 4:17 AM GMTఓవైపు మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికాకు ప్రయాణమవుతోందని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బాలిలో ఒణుకు పుట్టించే చలిలో గడ్డకట్టిన నీళ్లలో స్నానం చేస్తూ సామ్ ప్రత్యక్షమైంది. బాలి విహారయాత్రను ఆస్వాధిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను అంతర్జాలంలో షేర్ చేస్తోంది. విజయ్ దేవరకొండతో ఖుషి చిత్రీకరణను..వరుణ్ ధావన్‌తో 'సిటాడెల్' చిత్రీకరణను ముగించి ప్రస్తుతం కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని భావించిన సామ్ 'బాలి' యాత్రను ఆస్వాధిస్తున్నారు.
సమంత బాలిలో 4-డిగ్రీల ఐస్ బాత్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. బాలి సముద్ర తీరంలో ప్రశాంత వాతావరణంలో సామ్ తాను కోరుకున్నది దక్కించుకుంటోంది. ప్రశాంత వదనంతో కనిపిస్తోంది. బుధవారం సమంతా తన అభిమానులను విస్మయానికి గురిచేసే ఆకర్షణీయమైన ఫోటోని షేర్ చేసి దానికి ''#మంచు స్నానాలు 4 డిగ్రీల 6 నిమిషాలు'' అని క్యాప్షన్ ఇచ్చింది.
కొంతకాలంగా సమంత తనకు అత్యంత ఇష్టమైన పెట్స్ తో ప్రయాణాలు చేస్తోంది. ఇప్పుడు బాలిలో కూడా పెట్ స్నేహితుడితో సరదా సమయం గురించి అభిమానులకు వెల్లడించింది. ఇంతకుముందు షేర్ చేసిన ఒక ఫోటోగ్రాఫ్ లో విశాలమైన సముద్రం వైపు చూస్తూ అక్కడి అందాలను ఆరాధిస్తూ కనిపించింది. పెద్ద టోపీతో ఆకుపచ్చ స్లీవ్‌లెస్ దుస్తులను ధరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇంతకీ మయోసైటిస్ అంటే ఏమిటి? ఈ వ్యాధితో ఇబ్బందులు ఎలా ఉంటాయి? అంటే.. కండరాల మంట.. వాపు ..నొప్పి అత్యంత సాధారణ మైయోసిటిస్ లక్షణాలు. ఈ పరిస్థితిలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రశాంతత చాలా ముఖ్యం. అందుకే సామ్ ప్రస్తుతం బిజీ లైఫ్ నుంచి బయటపడి రిజనవేషన్ కోసం ప్రయత్నిస్తోంది. బాలి యాత్ర అనంతరం సమంత ప్రణాళిక ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది.