Begin typing your search above and press return to search.

అందానికే అందం అనేలా.. సామ్ హొయలు

బజార్ అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రీసెంట్ గా తన బోల్డ్ నెస్ ని పరిచయం చేసిన సమంత ఈసారి ఎంతో అందంగా వైట్ కలర్ డ్రెస్ లో మురిపించింది

By:  Tupaki Desk   |   20 Nov 2023 10:57 AM GMT
అందానికే అందం అనేలా.. సామ్ హొయలు
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సమంత బోల్డ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఎంతటి హాట్ టాపిక్ అయిందో తెలిసిందే.


బజార్ అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రీసెంట్ గా తన బోల్డ్ నెస్ ని పరిచయం చేసిన సమంత ఈసారి ఎంతో అందంగా వైట్ కలర్ డ్రెస్ లో మురిపించింది. సమంతా లేటెస్ట్ పిక్ నెటిజన్స్ దృష్టిని మరింత ఆకర్షించింది. ఈ ఫోటోలో తన సిజ్లింగ్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. 36 ఏళ్ల సమంత లేటెస్ట్ పిక్ చూసిన నెటిజన్స్ ఆమె అందానికి దాసోహం అవుతున్నారు.

ఇక వైరల్ అవుతున్న ఈ లేటెస్ట్ పిక్ లో సమంత వైట్ కలర్ ఫ్లూరల్ అవుట్ ఫిట్ ధరించగా బ్యాగ్రౌండ్ లో గ్రీన్ కలర్ పూల తోట కనిపిస్తోంది. ఆ పూల తోటలో సమంత మరింత అందంగా కనిపించింది. దీంతో నెట్టింట ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో ఆమె మయోసైటీస్ అనే వ్యాధి మారిన పడింది.

అందుకోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంది. ఈమధ్య కాస్త కోలుకుంది. అప్పటివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్న సామ్ ఈమధ్య వెకేషన్ లో భాగంగా ప్రపంచంలో వివిధ ప్రదేశాలను సందర్శించింది. మరోవైపు వీలైనంత త్వరగా మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సమంత ఇప్పటికే కొన్ని స్క్రిప్టులు వింటున్నట్లు సమాచారం.

ఈ ఏడాదిలో సమంతకు సరైన హిట్ దక్కలేదు. ఆమె నటించిన 'యశోద' పరవాలేదు అనిపించింది. కానీ 'శాకుంతలం', 'ఖుషి' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం సమంత చేతిలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఉంది. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది.