Begin typing your search above and press return to search.

బాబోయ్! 100కేజీలు ఎత్తి ప‌డేసిన సామ్!!

వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకులు, ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా సామ్ ని ఏమీ చేయ‌లేక‌పోయాయి

By:  Tupaki Desk   |   31 Dec 2023 6:31 AM GMT
బాబోయ్! 100కేజీలు ఎత్తి ప‌డేసిన సామ్!!
X

బాబోయ్! 100కేజీలు సింపుల్‌గా ఎత్తి ప‌డేసింది!! బైసెప్.. ట్రైసెప్.. లాఠీ ..యాబ్స్.. శ‌రీరంలో ఏ భాగం చూసినా వంకీలు తిరిగి క‌నిపిస్తున్నాయి. అస‌లు ఇలా వ‌ర్క‌వుట్లు చేస్తోంది అంత సున్నిత‌మైన స‌మంత‌యేనా? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. హార్డ్ వ‌ర్క్ కేరాఫ్ స‌మంత‌.. స‌మంత కేరాఫ్ డెడికేష‌న్!! అందుకేగా ప‌రిశ్ర‌మ‌లోకి ఇలా వ‌చ్చి అలా వెళ్లే క‌థానాయిక‌ల న‌డుమ తాను మాత్ర‌మే నిల‌దొక్కుకుని ఆకాశ‌మే హ‌ద్దుగా స్టార్ డ‌మ్ ని అందుకుంది.


వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకులు, ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా సామ్ ని ఏమీ చేయ‌లేక‌పోయాయి. ఇప్పుడు సమంత మాన‌సికంగా శారీర‌కంగా ఎంతో ధృఢంగా ఉంది. జీవితంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు త‌న‌ను తాను అన్నివిధాలా ప్రిపేర్ చేసింది. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఎత్తుల‌కు ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

తాజాగా స‌మంత‌ తన జిమ్ సెషన్ నుండి ఉత్కంఠభరితమైన విజువ‌ల్స్ ని షేర్ చేసింది. ఏకంగా 100 కిలోల బరువును అవ‌లీలగా ఎత్తి ప‌డేసింది. డెడ్‌లిఫ్టింగ్ లో బ‌ల‌ప‌రాక్ర‌మాన్ని ప్రదర్శించింది. వ్యాయామం అంటే ఏవో లైట్ వెయిట్స్ తో చేస్తుంద‌ని పొర‌బ‌డిన ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా షాకింగ్ ట్విస్ట్. స‌మంత ఏకంగా ఇంత పెద్ద బ‌రువుల్ని ఎత్తుతోందా? డ్యామిట్! అంటూ జిమ్ బాయ్స్ భేజారైపోతున్నారు. 100 లేదా 150 కిలోల బరువులు ఎత్తాలంటే చాలా శిక్ష‌ణ అవ‌స‌రం. క‌ఠోరంగా శ్ర‌మించే త‌త్వం కూడా కావాలి. శ‌రీరం అల‌వాటు ప‌డిన త‌ర్వాత మాత్ర‌మే అంత పెద్ద బ‌రువుల్ని ఎత్త‌గ‌ల‌రు. అంటే స‌మంత జిమ్ లో ఎంత‌గా నిబద్ధతతో శ్ర‌మిస్తోందో అర్థం చేసుకోవచ్చు. స‌మంత జిమ్మింగ్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మార‌గానే యువ‌త‌రం ప్ర‌తిస్పంద‌న‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. బ‌రువులెత్త‌గ‌ల‌వా ఓ న‌ర‌హ‌రి.. ద‌రువులేయ‌గ‌ల‌వా? అంటూ యూత్ జోష్ ప్ర‌ద‌ర్శిస్తోంది.

సమంత రూత్ ప్రభు మయోసైటిస్ కి చికిత్స తీసుకుని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌దుప‌రి భారీ ప్రాజెక్ట్‌లతో అల‌రించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంవ‌త్స‌రంలో దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషి చిత్రంలో న‌టించిన స‌మంత ఓటీటీ కోసం సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ లో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2'లో నటించిన సామ్ మ‌రోసారి డైనమిక్ డైరెక్టర్ ద్వయం రాజ్ అండ్ డికెతో క‌లిసి ప‌ని చేసింది. కొత్త సంవ‌త్స‌రంలో సిటాడెల్ కోసం ప్ర‌చారానికి స‌మంత సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. త‌దుప‌రి కొన్ని ప్రాజెక్టుల గురించి స‌మంత స్వ‌యంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని టాక్ వినిపిస్తోంది.