Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : స్పెషల్‌ డే రోజున పిల్లలతో సమంత

హీరోయిన్ గా సమంత వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి

By:  Tupaki Desk   |   24 Jan 2024 7:53 AM GMT
పిక్ టాక్‌ : స్పెషల్‌ డే రోజున పిల్లలతో సమంత
X

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యలు మరియు వరుస సినిమాల ఒత్తిడి నేపథ్యంలో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. గత ఏడాది నుంచి కూడా షూటింగ్ కు దూరంగా ఉంటున్న సమంత త్వరలోనే మళ్లీ యాక్షన్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


హీరోయిన్ గా సమంత వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సినిమాల కంటే ముందు సమంత వరుసగా సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ లు పెడుతూ సందడి చేస్తూ ఉంది. తాజాగా ఆమె ప్రమోట్‌ చేసే ప్రత్యూష ఫౌండేషన్ సోషల్‌ మీడియా అకౌంట్‌ లో సమంత ఫోటోలు షేర్ చేశారు.

నేడు జాతీయ బాలిక దినోత్సవం. ఈ సందర్భంగా చిన్నారులతో సమంత కేక్ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్న ఫోటోలను షేర్‌ చేశారు. సమంత చాలా యాక్టివ్‌ గా సంతోషంగా ఆ ఫోటోల్లో కనిపిస్తుందని నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రత్యూష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను సమంత చేసిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో కూడా ఈ ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. సమంత తో కలిసి జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు.